Saturday, July 27, 2024

‘దేవకీ నందన వాసుదేవ’ షూటింగ్ పూర్తి

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ’దేవకి నందన వాసుదేవ’ లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్. హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి బ్లాక్‌బస్టర్ ఆల్బం ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు మేకర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News