- Advertisement -
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ దేవర రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. పవర్ ఫుల్ డైలాగులు, యాక్షన్ సీన్స్, విజువల్ వండర్ గా ట్రైలర్ ను వదిలారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా వచ్చిన రిలీజ్ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్నది. సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.అనిరుధ్ రవి చంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల కానుంది.
- Advertisement -