Saturday, September 14, 2024

ప్రతి కాలనీ అభివృద్ధే ధ్యేయం : వివేకానంద్

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవ ర్గం, 132 జీడిమెట్ల డివిజన్, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రంగారెడ్డి బండ మరియు జొన్న బండలో సోమవారం ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నాశ్రీశైలం యాదవ్‌తో కలిసి పాదయాత్ర చేసారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

కాగా అక్కడక్కడా నెలకొన్న భూగర్భడ్రైనేజీ, అంతర్గతరోడ్లు, కరెంటు పోల్స్, తీగలు మార్చాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కాలనీ అభివృద్ధే తమ ధ్యేయం అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామనిపేర్కొన్నారు.

అనంతరం ఎళ్లవేళల అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ తమ బస్తీ అభివృద్ధికి సహకరిస్తున్నఎమ్మెల్యే కెపి వివేకానంద్‌ని రానున్న ఎన్నికలలో ముచ్చటగా మూడవసారి భారి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెల్పించుకుంటాం అని బిఆర్‌ఎస్ పార్టీకె తమ పూర్తి మద్దతు ముఖ్య మంత్రి కెసిఆర్‌ని తిరిగి ముఖ్యమంత్రిగా గెల్పించుకుంటాం అని ప్రకటిస్తూ బస్తీ వాసులు ఏకగ్రీవ తీర్మానం చేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులూ, ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకురాల్లు, బస్తీవాసులు తదితరుల పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News