Tuesday, December 10, 2024

కార్తీకశోభ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ సంచతరించుకుంది. శై వక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవా రం తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానా లు ఆచరించారు. తెల్లవారుజామున 4.30 గం టల నుంచి శివాలయాల్లో మహా న్యాసం, ఏకాద శ రుద్రాభిషేకంతో పూజలు ప్రారంభమయ్యా యి. శివనామస్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి. ఉసిరిచెట్టుకు భక్తులు ప్రత్యేక పూ జలు చేశారు. ప్రముఖ ఆలయాల్లో భక్తులు ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలు వెలిగించి మహిళా భక్తులు పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మ హిళలు దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు. శివపార్వతులకు అభిషేకాలు చేశారు. పలు ఆలయాల్లో భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు.

శ్రీశైలంలో ప్రత్యేక పూజలు
శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంభ దేవీ కి భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, కుంకుమార్చన పూజలు జరిపి, ఉ సిరి చెట్టుకు మహిళలు పూజలు చేసి కార్తీక దీపా లు వెలిగించారు. శివాలయంలో పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి.
వేములవాడకు పోటెత్తిన భక్తగణం
రాజన్నసిరిసిల్ల జిల్లా కార్తీక పౌర్ణమి సందర్బం గా వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తులు పోటెత్తారు. ఆలయం ముందు కార్తీక దీపాలు వెలిగిం చి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. సా యంత్రం ఆలయం ముందు భాగంలో జ్వాలా తోరణం నిర్వహించనున్నారు. జగిత్యాల జిల్లా లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ధర్మపురి గోదావరి నదిలో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తా రు. గోదావరి నదిలో ప్రత్యేక పూజలు నిర్వహిం చి భక్తి శ్రద్ద లతో కార్తీక దీపాలను ఒదిలారు.

కీసరగుట్ట ఆలయంలో….
కార్తీక పౌర్ణమి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టకు భక్తులు వేలాదిగా పోటెత్తారు. తెల్లవారుజామునే భక్తులు స్నానమాచరించి శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నా రు. ఆలయ పరిసరాలు ఓం నమః శివాయ, హ రహర మహాదేవ అంటూ శివనామస్మరణతో మారుమ్రోగాయి. భక్తులు దీపాలు వెలిగించి, కొ బ్బరికాయలు కొట్టి తమ కోరికలు తీరాలని మనసారా వేడుకుంటూ తమ శక్తి కొలది కొలుచుకుంటూ స్వామి వారి సేవలో తరించారు.
వేయిస్తంభాల దేవాలయంలో
వేయిస్తంభాల దేవాలయంలో భక్తులు ఉసిరి చె ట్టు కింద పూజలు చేసి దీపాలు వెలిగించారు. అ నంతరం స్వామి వారిని భక్తులు దర్శించు కున్నా రు. కాళేశ్వరం గోదావరి దగ్గర కార్తీక పౌర్ణిమ శోభ సంతరించుకుంది. పవిత్ర స్నానాలు ఆచరించి దీపాలను భక్తులు గంగలో ఒదిలారు.

కందికొండకు తరలివచ్చిన భక్తులు
మహబూబాబాద్ జిల్లా కందికొండ జాతరకు భ క్తులు తరలివచ్చారు. దీంతో కందికొండ భక్తులతో రద్దీగా మారింది. దైవ దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతుండటంతో భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
యాదగిరిగుట్టలో భారీగా వ్రతాలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు భారీగా సత్యనారాయణ స్వా మి వ్రతాలు చేసుకున్నారు.

ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే శివాలయం..దర్శనానికి భక్తుల
యాదాద్రి జిల్లాలోని ఓ శివాలయానికి భక్తులు క్యూ కట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థా న్ నారాయణపురం మండలంలోని చిల్లాపురం గ్రామంలోని ఓ ఎత్తైన గుట్టపై 900 ఏళ్ల క్రితం రామలింగేశ్వర స్వామి స్వయంభూగా వెలసిన ట్లు చెబుతారు. ఆ గుట్టనే రామస్వామి గుట్టగా పిలుస్తారు. కేవలం కార్తిక పౌర్ణమి రోజున 24 గంటల పాటు మాత్రమే తెరవడం ఈ ఆలయం ప్రత్యేకత. శుక్రవారం కార్తిక పౌర్ణమి కావడంతో ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఈ ఒక్క రోజే వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వయం భు వుగా వెలసిన రామలింగేశ్వర స్వామిని కనులా రా దర్శించుకున్నారు. శివ నామస్మరణతో ఆ ప్రాంతం మొత్తం మార్మోగిపోయింది.

రాజమండ్రిలో కార్తీక పౌర్ణమి శోభ
రాజమండ్రి: రాజమండ్రిలో కార్తీక పౌర్ణమి సం దడి నెలకొంది. గోదావరి స్నానఘట్టాల్లో భక్తుల పుణ్య స్నానాలు చేశారు. శివాలయాలకు భక్తు లు పోటెత్తారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.
బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో…
బాపట్ల సూర్యలంక సముద్రతీరంలో కార్తీక పౌర్ణ మి సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేం ద్ర వర్మ ప్రత్యేక పూజలు చేసి సాగర హారతి ఇచ్చారు. తెల్లవారుజామునుంచే పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలతో పూజలు నిర్వహిస్తున్నారు. సూర్యలంక సముద్రతీరం హరోం హర, శంభో శివ శంభో అంటూ శివనామస్మరణతో మార్మ్రోగింది. భక్తజన సందోహంతో సముద్రతీరాన బారులు తీరింది.

బెజవాడ ఇంద్రకీలాద్రిలో…
కార్తీక పౌర్ణమి సందర్భంగా, విజయవాడ ఇంద్రకీలాద్రిలో శ్రీ దుర్గాదేవి అమ్మవారి గిరి ప్రదక్షిణ మహోత్సవం నిర్వహించారు. విజయవాడలోని ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ గిరి ప్రదక్షిణ ఉదయం 6 గంటలకు ప్రారంభమై దా దాపు మూడు గంటల పాటు సాగింది. ఐదున్నర గంటల సమయంలో కొండ దిగువన అమ్మవారి రథం ఉంచారు. అమ్మవారి ఉత్సవమూర్తులు కూడా ఈ గిరి ప్రదక్షిణలో దర్శన మిచ్చాయి.

శ్రీకాకుళం జిల్లాలో..శివుడిని
దర్శించుకున్న ఎలుగుబంట్లు
దేవుణ్ని దర్శించుకునేందుకు వెళ్లిన వారికి గుడి లో గుండె పగిలే ఓ దృశ్యం ఎదురైంది. ఆలయం లోపలికి ఇలా వెళ్లగానే అలా ఎలుగు బంట్లు హ ల్‌చల్ చేస్తూ కనిపించాయి. ఈ ఘటన ఎపిలోని శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణపురంలోని శివాలయంలో జరిగింది. కార్తిక పౌర్ణ మి సందర్భంగా స్థానికంగా ఉండేవారు తెల్లవారుజామున శివుణ్ని దర్శించుకునేందుకు వెళ్లా రు. లోపలికి ఇలా వెళ్లారో లేదో 3 ఎలుగుబంట్లు చొరబడ్డాయి. అలా అవి సంచరించడంతో ప్రజ లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంట్లు అటూ ఇటూ తిరుగుతూ కాసేపు అలజడి సృష్టించాయి. దీంతో స్థానికులు కర్రల తో బెదిరించారు. కాసేపటికి సమీపంలోని తోటల్లోకి వెళ్లడంతో భక్తులు పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News