టీం ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్(Shikhar Dhawan).. తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చాడు. తాజాగా ధావన్ క్రికెటర్ నుంచి రచయితగా మారిపోయిుడు. ‘ది వన్’ పేరుతో తన ఆత్మకథని విడుదల చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నరు. ‘విజయాలు అన్ని హైటైల్స్ కాదు.. ఓటములు స్కోర్ బోర్డుపై కనిపించవు.. ది వన్ అనేది హృదయం నుంచి వచ్చింది’ అని ధావన్ క్యాప్షన్ పెట్టాడు.
‘ది వన్’ పుసక్తంలో అనేక విషయాలను ఏ దాపరికం లేకుండా ప్రస్తావించాడు ధావన్ (Shikhar Dhawan). తన బాల్యం, టీం ఇండియా జెర్సీ ధరించాలనే కలను నిజం చేసుకోవడం, భారత తరఫున క్రికెట్ ఆడటం, తదితర అంశాలను ఈ బుక్‌లో పొందుపరిచాడు. దీంతో పాటు వ్యక్తిగత జీవితంలో ఎదురుకున్న ఎత్తుపల్లాలను గూర్చి ఇందులో పేర్కొన్నాడు. ఈ పుస్తకం చదవాలంటే ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాలని స్పష్టం చేశాడు.