Friday, March 29, 2024

రేపటి నుంచే డిజిటల్ కరెన్సీ ‘పైలట్’ : ఆర్ బిఐ

- Advertisement -
- Advertisement -

Digital Rupee

న్యూఢిల్లీ: ప్రభుత్వ సెక్యూరిటీలలో లావాదేవీల కోసం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ – డిజిటల్ రూపాయి (హోల్‌సేల్ విభాగం) యొక్క మొదటి ‘పైలట్’ మంగళవారం ప్రారంభించబడుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీలలో.. సెకండరీ మార్కెట్ లావాదేవీలను నిర్వహించడానికే ఈ డిజిటల్ కరెన్సీ పైలట్ అని ఆర్‌బిఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

తొమ్మిది బ్యాంకులు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్ బిసి  ‘పైలట్‌’లో పాల్గొనడానికి గుర్తించబడ్డాయి. కస్టమర్లు, వ్యాపారులతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌లలోని ఎంపిక చేసిన ప్రదేశాలలో ఒక నెలలోపు డిజిటల్ రూపాయి – రిటైల్ సెగ్మెంట్ యొక్క మొదటి పైలట్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఆర్బిఐ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News