Saturday, August 16, 2025

గ్రాండ్‌స్లామ్ టైటిల్ జకోవిచ్‌ సాధించేనా?

- Advertisement -
- Advertisement -

25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేనా?

మన తెలంగాణ/ క్రీడా విభాగం: దశాబ్దాలుగా ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్‌కు కొంతకాలంగా ఏదీ కలిసి రావడం లేదు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా జకోవిచ్ కొనసాగుతున్నాడు. చిరకాల ప్రత్యర్థులు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రఫెల్ నాదల్ (స్పెయిన్), ఆండ్రీ ముర్రే (బ్రిటన్)లు ఇప్పటికే అంతర్జాతీయ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే జకోవిచ్ మాత్రం ఇంకా ఆటలో కొనసాగుతూనే ఉన్నాడు. రెండేళ్లుగా జకోవిచ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం పరితపిస్తున్నాడు. అయితే యువ ఆటగాళ్లు జన్నిక్ సినర్ (ఇటలీ), కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్)ల నుంచి జకోవిచ్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది.

రెండేళ్లుగా సినర్, అల్కరాజ్‌లు మాత్రమే గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తున్నారు. జకోవిచ్‌కు మాత్రం గ్రాండ్‌స్లామ్ టైటిల్ లభించడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే మూడు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు జరిగాయి. ఒక్కదాంట్లో కూడా నొవాక్ టైటిల్ సాధించలేక పోయాడు. 2024లో కూడా జకోవిచ్‌కు నిరాశే ఎదురైంది. ఆ ఏడాది సినర్, అల్కరాజ్‌లు రెండేసి టైటిల్స్‌ను దక్కించుకున్నారు. జకోవిచ్ ఒక్క గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని కూడా అందుకోలేక పోయాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సినర్ రెండు, అల్కరాజ్ ఓ ట్రోఫీని సాధించాడు. ఇక కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాలని భావిస్తున్న జకోవిచ్‌కు యూఎస్ ఓపెన్‌లోనూ నిరాశ తప్పక పోవచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్ సినర్ జోరుమీదుందడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పాలి. ఇక వింబుల్డన్ ఓపెన్ ఫైనల్లో ఓడిన అల్కరాజ్ ఈసారి ఎలాగైనా యూ ఎస్ ఓపెన్‌ను గెలుచుకోవాలని తహతహలాడుతున్నాడు. సినర్, అల్కరాజ్‌ల పోటీని తట్టుకుని గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని సాధించడం జకోవిచ్‌కు అంత తేలికకాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వరుస విజయాలతో ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో ఎదురులేని శక్తులుగా మారిన సినర్, అల్కరాజ్‌లను దాటి గ్రాండ్‌స్లామ్ వంటి మెగా టైటిల్‌ను సాధించడం చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పా లి. ప్రస్తుతం జకోవిచ్ ఫిట్‌నెస్ లేమీతో బాధపడుతున్నా డు. దీనికి భిన్నంగా సినర్, అల్కరాజ్, జ్వరేవ్ తదితరులు అద్భుత ఫిట్‌నెస్‌తో దూసుకెళుతున్నారు. జకోవిచ్‌కు ఫిట్‌నెస్‌తో పాటు వయసు పెద్ద సమస్యగా తయారైంది. యువ ఆటగాళ్ల పోటీని తట్టుకుని ముందుకు వెళ్లడం ప్రస్తుత పరిస్థితుల్లో జకోవిచ్‌కు అంత సులువుకాదని చెప్ప క తప్పదు.

ప్రస్తుతం జకోవిచ్ కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించాడు. మరో టైటిల్ సాధిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తున్నాడు. కానీ రెండేళ్లుగా అతనికి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ నెలలో ఆరంభమయ్యే సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఎలాగైనా టైటిల్‌ను సాధించాలని జకోవిచ్ భావిస్తున్నాడు. కానీ అల్కరాజ్, సినర్, జ్వరేవ్ వంటి యువ ఆటగాళ్లను తట్టుకుని దీన్ని సాధించడం అనుకున్నంత తేలికేం కాదు. అయితే అసాధారణ పోరా ట పటిమకు మరో పేరుగా చెప్పుకునే జకోవిచ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయలేం. తన మార్క్ ఆటతో చెలరేగితే అతన్ని ఆపడం ఎంత పెద్ద ఆటగాడికైనా చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News