Monday, May 12, 2025

ముందుపాతరలు, పొంచి ఉన్నదాడులు.. ఇళ్లకు వెళ్లవద్దని కశ్మీరీలకు సూచనలు

- Advertisement -
- Advertisement -

ఇప్పటికిప్పుడు తొందరపడి ఇళ్లకు, స్వస్థలాలకు వెళ్లవద్దు ,తదుపరి ప్రకటన వెలువడే వరకూ సురక్షిత ప్రాంతాల్లోనే పౌరులు ఉండాలి అని జమ్మూ కశ్మీర్ ప్రాంత ఉన్నతాధికారులు తెలిపారు. భారత్ పాకిస్థాన్ మధ్య సైనిక చర్యల నిలిపివేత తరువాతి పరిణామాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రజలకు పలు సూచనలతో ఆదివారం మార్గదర్శకాలను వెలువరించింది. కాల్పుల విరమణ జరిగిందనేది నిజమే అయితే ఇప్పటికీ పలు ప్రాంతాలో శిథిలాలు ఉన్నాయ. ఎక్కడైనా, ఎప్పుడైనా మందుపాతరలు పేలవచ్చు. లేదా ఏదైనా జరగవచ్చు , ఈ దశలో ప్రజలు తొందరపడి స్వస్థలాలకు తరలివెళ్లరాదని సూచించారు. పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి ఉన్న గ్రామాలకు చెందిన రెండు లక్షల మందిని భారత్ పాక్ ఘర్షణల దశలో సురక్షితప్రాంతాలకు తరలించారు. కాల్పుల విరమణ ప్రకటన జరిగింది .

అయితే సరిహద్దులకు ఆవల నుంచి ఇప్పటికీ అప్పుడప్పుడు కాల్పులు , క్షిపణి దాడులు, డ్రోన్ల దూకుడు జరుగుతోంది.ఈ దశలో ఇప్పటికీ ఎటువంటి ముప్పు అయినా తలెత్తవచ్చు. పైగా పేలని మందుపాతరలు ఉంటాయి. పూర్తిగా తనిఖీలు జరగాల్సి ఉంది. అన్ని చర్యల తరువాత ప్రజలకు తెలిసేలా స్థానికంగా అందరికి తెలియచేయడం జరుగుతుంది. అప్పటివరకూ తొందరపడి ఇళ్లకు స్వస్థలాలకు చేరుకోరాదని అధికారులు సూచించారు. అయితే జనం కాసింత ప్రశాంతత ఏర్పడటంతో ఉరుకులుపరుగులపై తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. బాంబులు , మందుపాతరల గాలింపు వెలికితీతల ఆపత్కాల నివారణ చర్యల బృందాలు రంగంలోకి దిగుతాయి. తరువాతనే జనం ఇళ్లకు చేరడం మంచిదని సూచనలు వెలువరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News