Sunday, September 15, 2024

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ  187.40 పాయింట్లు లేక 0.75 శాతం పెరిగి 25010.60 వద్ద ముగిసింది. కాగా సెన్సెక్స్ 611.90 పాయింట్లు లేక 0.75 శాతం పెరిగి 81698.11 వద్ద ముగిసింది. నేడు 2075 షేర్లు లాభపడగా, 1791 షేర్లు నష్టపోయాయి. 138 షేర్లు మార్పు లేకుండా యథాతథంగా ముగిశాయి.

నిఫ్టీలో హిందాల్కో, ఎన్టీపిసి, హెచ్ సిఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్, ఓఎన్జీసి ప్రధానంగా లాభపడగా, అప్పోలో హాస్పిటల్స్, హీరో మోటో కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, ఐషెర్ మోటార్స్, మారుతి సుజుకీ షేర్లు నష్టపోయాయి. ఒక్క పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ (0.5 శాతం పతనం) రంగం తప్పించి అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News