Sunday, October 6, 2024

ట్రంప్‌పై హత్యా యత్నం.. గోల్ఫ్ కోర్సులో ఘటన

- Advertisement -
- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్స్‌లో గోల్ఫ్ ఆడుతుండగా జరిగిన హత్యా యత్నం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ట్రంప్‌పై రెండు నెలల్లో ఇది రెండవ హత్యా యత్నం. ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్‌లో ట్రంప్ ఇంటర్నేషల్ గోల్ఫ్ క్లబ్‌లో ఆదివారం ఆ సంఘటన జరిగింది. వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో ‘ప్రాపర్టీ లైన్ సమీపంలో కనిపించిన ఒక సాయుధ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు’ అని మియామిలో ఇన్‌చార్జిగా ఉన్న స్పెషల్ ఏజెంట్ రఫేల్ బారోస్ పత్రికా గోష్ఠిలో చెప్పారు. కస్టడీలో ఉన్న ‘ఆ వ్యక్తి మా ఏజెంట్ల కాల్పులకు గురయ్యాడా లేడా అన్నది ఏజెన్సీకి స్పష్టంగా తెలియదు’ అని ఆయన చెప్పారు. ఆ సమయంలో క్లబ్‌లో గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్‌కు ఎటువంటి గాయాలూ తగలలేదు.

గోల్ఫ్ కోర్స్ కంచెలో నుంచి చొచ్చుకువచ్చిన రైఫిల్‌తో ఉన్న అనుమానితుని ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ చూసినట్లు, అనుమానితుడు అక్కడి నుంచి పారిపోయే లోపే అతనిపై ఏజెంట్ కాల్పులు జరిపినట్లు పామ్ బీచ్ కౌంటీ షెరీఫ్ రిక్ బ్రాడ్‌షా తెలియజేశారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి 78 ఏళ్ల ట్రంప్ అనుమానితునికి 300 గజాల నుంచి 500 గజాల దూరంలో ఉన్నారని బ్రాడ్‌షా తెలిపారు. ‘అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ తన సమీపంలో జరిగిన తుపాకీ కాల్పుల దరిమిలా క్షేమంగా ఉన్నారు. ఈ సమయంలో అదనపు వివరాలు లేవు’ అని ట్రంప్ ప్రచార కమ్యూనికేషన్ల డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ ఆ వెంటనే ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్ తన మద్దతుదారులకు ఒక సందేశం ఇస్తూ, తాను క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. ‘నా సమీపంలో తుపాకి కాల్పులు జరిగాయి. కానీ, వదంతులు మొదలై అదుపు తప్పకుండా నిరోధించేందుకు ముందుగా మీరు నా మాటలు వినాలని అనుకుంటున్నా: ‘నేను క్షేమం, బాగున్నాను. నన్ను ఏదీ తగ్గించబోదు.

నేను ఎన్నడూ లొంగబోను’ అని మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఆదివారం సంఘటన సందర్భంగా హవాయిలోని ఒక చిన్న నిర్మాణ సంస్థ యజమాని 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్‌ను నిర్బంధంలోకి తీసుకున్నట్లు ముగ్గురు భద్రత దళ ప్రతినిధులు వెల్లడించారు. మాజీ అధ్యక్షుని చాలా సార్లు రౌత్ విమర్శించాడు. ఇది రెండు నెలల్లో ట్రంప్‌పై జరిగిన హత్యా యత్నం. జూలైలో పెన్సిల్వేనియాలో ఒక ర్యాలీలో ట్రంప్‌పై జరిగిన హత్యా యత్నం మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై ఒక యువ షూటర్ పలు తూటాలు కాల్చినప్పుడు ఆయన కుడి చెవికి గాయమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News