Saturday, April 27, 2024

అమెరికా బరిలో ట్రంప్ కార్డు

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్ష బరిలో ఇక ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరఫున తిరుగులేని ప్రెసిడెంట్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ దాదాపుగా ఖరారయినట్లే. మరో 3 రాష్ట్రాలలో జరిగిన పార్టీ అభ్యర్థి ఎంపిక పోటీలో ట్రంప్ విజయం సాధించారు. మిస్సోరి, మిచిగాన్, ఇడాహో రాష్ట్రాలలో విజయం ఆయన అభ్యర్థిత్వాన్నిదాదాపుగా ఖరారు చేసింది. పార్టీలో అభ్యర్థిని ఎంచుకునేందుకు బలపరీక్షకు అంతర్గత పోటీ జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఏకకాలంలో మూడు రాష్ట్రాలలో ట్రంప్ విజయం కీలకంగా మారింది. ఇక వచ్చే మంగళవారం ఈ ప్రక్రియలో ఈ పోటీ క్రమంలో పార్టీకి సూపర్ ట్యూస్‌డే కానుంది. అప్పుడు ఏకంగా 15 రాష్ట్రాలు తమ అభ్యర్థి ఎవరనేది తేల్చుకుంటారు.

దీనితో అభ్యర్థి ఎవరనేది తేలిపోతుంది, వచ్చే వారం రిపబ్లికన్లకు, డెమోక్రట్లకు అత్యంత కీలక వారం అయింది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో ట్రంప్ తమ ఆధిక్యతను చాటుకుంటూ వచ్చారు. ఇప్పటి పరిణామాల నడుమ ట్రంప్ వచ్చే వారం కూడా ఈ బరిలో సునాయాసంగా గెలుస్తారని ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పలు ప్రాంతాలలో ట్రంప్ తమ సమీప ప్రత్యర్థి నిక్కి హేలీని తోసిరాజంటూ ముందుకు కదులుతున్నారు. మిచిగాన్ పోటీలో ట్రంప్ మొత్తం 39 డెలిగేట్ ఓట్లు రాబట్టుకున్నారు. ఇడాహో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ప్రఖ్యాత అమెరికా మీడియా సంస్థలన్ని కూడా ట్రంప్ స్పీడు ముందు ప్రత్యర్థులు నిలవలేకపోతున్నారని పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News