Wednesday, May 15, 2024

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు 

- Advertisement -
- Advertisement -

టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి జి. రఘుమా రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్: లైన్ మెన్ పోస్టుల భర్తీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి జి. రఘుమారెడ్డి తెలిపారు. వీటి కోసం దళారులు మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థలో 1553 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 2023 లో నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు.ఈ నియామక ప్రక్రియలో భాగంగా గతంలో రాత పరీక్ష నిర్వహించామన్నారు.ఈ నియామక ప్రక్రియలో చివరి ఘట్టంగా, మెరిట్ మరియు రూల్ అఫ్ రిజర్వేషన్స్ ను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన అభ్యర్థులకు ఆగస్ట్ 28 నుండి వివిధ జిల్లా సర్కిళ్ల కేంద్రాల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, పోల్ క్లైమ్బింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

దీనికి సంబందించిన పూర్తి సమాచారాన్ని సంస్థ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు చెప్పారు.నిర్ణీత అర్హతలు ఉండి, పోల్ క్లైమ్బింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుండి మెరిట్, రూల్ అఫ్ రిజర్వేషన్స్ అనుసరించి అత్యంత పారదర్శకంగా జూనియర్ లైన్ మెన్ నియామక ప్రక్రియ జరుగుతుందన్నారు.ఈ నేపథ్యంలో విద్యుత్ పంపిణి సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారులను కానీ, సంస్థ సిబ్బందిని గాని నమ్మి మోసపోవద్దని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి జూనియర్ లైన్ మెన్ అభ్యర్థులకు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News