Monday, April 29, 2024

గ్యాస్ సిలిండర్ ఈకెవైసికి తొందర వద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్యాస్ సిలిండర్ రూ.500కే పొందే పథకానికి సంబంధించి ఈకెవైసికి తొందర పడాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు కల్లూరి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. డిసెంబర్ 30నాటికే పూర్తి చేయాలని పుకార్లు రావటంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద భారీ సంఖ్యలో వినియోగదారులు క్యూలు కడుతున్నారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ సిలిండర్ పథకానికి విధివిధానాలు ఇంకా వెలువడలేదన్నారు. కానీ కేద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీల ద్వారా వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి ఈకెవైసిని వీలైనతం త్వరగా పూర్తి చేయాలని తమకు ఆదేశాలు ఇచ్చారన్నారు. అందువల్ల వినియోగదారులు భయాందోళనతో తొందర పడవద్దని తెలిపారు. ఎల్పీజి సిలిండర్ డెలివరి బాయ్ ఇళ్లకు వచ్చినపుడే ఈకెవైసి పూర్తిచేసుకోవచ్చని తెలిపారు. ఏదైనా సాంకేతిక సమస్యలు ఉన్నపుడు మాత్రమే ఏజెన్సీల వద్దకు రావాలని అసోసియేషన్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి వినియోగదారులకు విజ్ణప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News