Friday, May 16, 2025

దోస్త్ వచ్చింది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సటీల పరిధిలో డి గ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ – తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రా రంభం కానుంది. ఈ మేరకు శుక్రవా రం రాష్ట్ర కళాశాల విద్య కమిషనర్ ఎ .శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మ న్, దోస్త్ కన్వీనర్ వి.బాలకిష్టారెడ్డి దోస్త్ 2025 నోటిఫికేష న్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండ లి వైస్ ఛైర్మన్ ఎస్‌కె మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటే శ్, ఇతర తదితరు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మ న్ బాలకిష్టారెడ్డి మా ట్లాడుతూ, డిగ్రీ ప్ర వేశాలకు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చె ల్లించి విద్యార్థులు రి జిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. మొ దటి విడత దోస్త్ ప్ర వేశాల ప్రక్రియ శనివారం నుంచి ప్రా రంభమవుతుందని అ న్నారు. ఈనెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించి,

10 నుం చి 21 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నట్టు వివరించారు. ఈనెల 29న తొలి విడత డిగ్రీ సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించా రు. మూడు విడతల్లో సీట్లు పొందిన వి ద్యార్థులు జూన్ 24 నుంచి జూన్ 28 లోపు నేరుగా కళాశాలల్లో రిపోర్టింగ్ చే యాల్సి ఉంటుంది. జూన్ 30 నుంచి డి గ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రా రంభం అవుతాయి. రాష్ట్రంలో దోస్త్ పరిధిలో 1025 డిగ్రీ కాలేజీల్లో 4,57,724 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నా రు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జెఎన్‌టియుహెచ్, తెలంగాణ మ హిళా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలనుకునే డిగ్రీ చేరాలనుకునే అభ్యర్థులకు దోస్త్ సింగిల్ విండోలాంటిది. రాష్ట్రంలో దోస్త్ ద్వారా నిర్వహించే డిగ్రీ ప్రవేశాలలో మిగతా రిజర్వేషన్లతో పాటు ఈసారి ఎస్‌సి వర్గీకరణ అమలు చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి వెల్లడించారు.

అందుబాటులోకి వాట్సాప్ చాట్‌బాట్
దోస్త్ వాట్సాప్ నెంబరు: 7901002200 ద్వారా వాట్సాప్ చాట్‌బాట్ అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులు ఈ వాట్సాప్ నెంబర్‌కు హాయ్ అని టైప్ చేసి పంపిస్తే దోస్త్ మెను వస్తుంది. అందులో విద్యార్థులు తమ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులు కోరితే వారి వాట్సాప్ నెంబర్‌కు ఒటిపి, ఇతర అలర్ట్ కూడా వస్తాయి. వీటితోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు.
దోస్త్ ఫేస్‌బుక్ పేజీ: facebook.com/ dost.telangana దోస్త్ యూట్యూబ్ చానల్ : http:// youtube.com/ c/ dost.telanganaదోస్త్ ట్విట్టర్ ఖాతా : twitter.com/ dost. telangana
దోస్త్ వాట్సాప్ నెంబరు: 7901002200
హెల్ప్ లైన్ నెంబర్ : 040 23120416

ఇదీ దోస్త్ షెడ్యూల్
మే 3 నుంచి 21 వరకు రూ.200 ఫీజుతో మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
– మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
మే 29వ తేదీన మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
మే 30 నుంచి జూన్ 6 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం
మే 30 నుంచి జూన్ 8 వరకు రూ.400 ఫీజుతో రెండవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
మే 30 నుంచి జూన్ 9 వరకు రెండవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
జూన్ 13వ తేదీన రెండవ విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
జూన్ 13 నుంచి 18 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం
జూన్ 13 నుంచి 19 వరకు మూడవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
జూన్ 13 నుంచి 19 వరకు మూడవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
జూన్ 23వ తేదీన మూడవ విడత సీట్ల కేటాయింపు
జూన్ 23 నుంచి 28 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం
జూన్ 24 నుంచి 28 వరకు మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు నేరుగా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలి
– జూన్ 24 నుంచి 28 వరకు విద్యార్థులకుకళాశాలల్లో ఒరియెంటేషన్ ఉంటుంది.
జూన్ 30 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News