Wednesday, August 27, 2025

మద్యం మత్తులో డాక్టర్ హల్‌చల్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : మత్తులో ఓ డాక్టర్ హల్‌చల్ చేయగా ఆర్‌ఎంపి శంకర్ రావుకి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని ఏదులాపురం బైపాస్ వద్దగల డీఎస్ పెట్రోల్ బంకు వద్ద గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన ఆర్‌ఎంపి కటకం శంకర్ రావు ఖమ్మం నుంచి పిండిప్రోలు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఏదులాపురం బైపాస్ వద్దకు రాగానే శ్రీ హర్ష డాక్టర్ దరవత్ లక్ష్మణ్ సింగ్ కారు అతి వేగంగా వచ్చి శేఖర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. కటకం శేఖర్ కు తీవ్ర గాయాలవగా స్థానికులు గుర్తించి 108 వాహనం ద్వారా ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు మరల డివైడర్ ను ఢీకొట్టడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News