Monday, April 29, 2024

రైతులకు లక్ష రుణ మాఫీ వెంటనే చేయాలి

- Advertisement -
- Advertisement -

బోనకల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ లక్ష రుణమాఫీ వెంటనే చేయాలని సీపీఎం అనుబంద రైతు సంఘం నాయకులు డిమాండు చేశారు. శుక్రవారం తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు ఆద్వర్యంలో స్దానిక తహశీల్దారు కార్యాలయం ముందు ఆ సంఘం నేతు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా రాంబాబు మాట్లాడుతూ రైతులు అనేక సమస్య ఎదుర్కొంటున్నప్పటికి నాలుగున్నర ఏళ్ళ నుండి రుణమాఫీ చేయకుండా కాలయాపనచేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఇంకా 9.50 లక్షల సాధారణ అగ్నిమెంట్లు పరిష్కారానికి నోచుకోక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అకాల వర్షానికి పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం ఇస్తామని సీఎం ప్రకటించారని కాని అనేక మంది అనర్హులకు ఆ పరిహారం వచ్చిందని అసలైన నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదని విమర్శించారు.

ధరణిలో జరుగుతున్న లోపాలను సరిచేశామని ముఖ్యమంత్రి ప్రకటించారని కాని అవి పరిష్కారం కాక రైతులు తీవ్ర ఇబ్బది పడుతున్నారన్నారు. ఈ సందర్బంగా పలు సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ వినతిపత్రాన్ని తహశీల్దారు రమణికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అద్యక్షుడు చింతలచెర్వు కోటేశ్వరావు, సీపీఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, ఎంపీటీసీలు కందిమళ్ల రాధ, జొన్నలగడ్డ సునీత, మండల కార్యదర్శి తుళ్ళూరి రమేష్, కందికొండ శ్రీనివాసరావు, కిలారు సురేష్, దొప్ప కొరివి వీరభద్రం, గుడ్డూరి ఉమ, దొండపాటి సత్యనారాయణ,కల్యాణపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి : వివిధ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులు వద్దకు సీసీఎం నాయకులు వెళ్లి వారి సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ న్యాయమైన వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News