Monday, February 26, 2024

ముంచెత్తిన యమున..ఢిల్లీలో తాగునీటికి కటకట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారీ వర్సాల కారనంగా యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాలలో మంచినీటికి కటకట ఏర్పడడంతోపాటు మోట్రో సర్వీసులకు విఘాతం ఏర్పడింది. ఢిల్లీలో యమునా నది 208.48 మీటర్ల ఎత్తులో పొంగిప్రవహిస్తుండడంతో సమీపంలోని అనేక వీధులు, నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు నీట మునిగిపోయాయి. నదికి సమీపంలోని కాలనీల ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో గతంలో 1924, 1977, 1978, 1995, 2010, 2013లో భారీ వరదలు సంభవించాయి.

గత బుధవారం యమునా నది నీటి ప్రవాహం గడచిన 45 సంవత్సరాలలో మొట్టమొదటిసారి 207.49 మీటర్లకు చేరుకుంది.
యమునా నది ప్రవాహ స్థాయి పెరిగిపోయిన కారణంగా వజీరాబాద్, చంద్రవల్, ఓక్లాలోని వాటర్ ట్రీట్‌మెంవ ప్లాంట్లు మూతపడ్డాయ.ఇ, దీంతో నగరంలోని కొన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం తెలిపారు. యమునా నది ఒడ్డున ఉన్న వజీరాబాద్ ప్లాంట్‌ను స్వయంగా సందర్శించానని ఆయన తెలిపారు. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే ప్లాంట్లను మళ్లీ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

యమునా నది ప్రవాహం పెరుగుతున్నందున బ్లూ లైన్‌లో ఉన్న యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికుల ఎంట్రీ, ఎగ్టిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ గురువారం ప్రకటించింది.

ఇలా ఉండగా వరద నీటిలో చిక్కుకున్న ప్రాంతాలలో ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రజలు గుంపులుగా తిరగకుండా కట్టడి చేసేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News