Tuesday, April 30, 2024

తమిళ సినీ నిర్మాత జాఫర్ పై డ్రగ్స్ కేసు

- Advertisement -
- Advertisement -

చిత్ర నిర్మాణం, రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు రూ. 40 కోట్లు మళ్లింపు

న్యూఢిల్లీ : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన తమిళ సినీ నిర్మాత , డీఎంకే మాజీ సభ్యుడు జాఫర్ సాదిక్ కొన్ని కోట్ల రూపాయలను చిత్ర పరిశ్రమ, ఇతర వ్యాపారాలకు వినియోగించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. ఏప్రిల్ 9న చెన్నై, మధురై, తిరుచురాపల్లిలో ఫెడరల్ ఏజెన్సీ జరిపిన దాడుల ఆధారంగా ఈడీ శనివారం ఈ ప్రకటనను విడుదల చేసింది. డ్రగ్స్ అక్రమ రవాణా ద్వారా ఆర్జించిన రూ. 40 కోట్లను జాఫర్ చిత్ర నిర్మాణం, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లోకి మళ్లించినట్టు పేర్కొంది.

వీటిలో రూ. 6 కోట్లకు పైగా ప్రత్యక్ష నగదు చెల్లింపులు జరిపినట్టు తెలిపింది. రూ. 12 కోట్లకు పైగా సినీ నిర్మాణంలో , రూ. 21 కోట్లను బ్యాంకు ఖాతాల్లో గుర్తించినట్టు ఈడీ వివరించింది. స్థిరాస్తుల కోసం ఎక్కువ మొత్తంలో వినియోగించినట్టు పేర్కొంది. దీనికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయంటూ ఈడీ వెల్లడించింది. రూ. 2 వేల కోట్ల డ్రగ్స్ పరిధిలో మరింత సమాచారం కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపింది.

కోలీవుడ్ లో నాలుగు సినిమాలు నిర్మించిన జాఫర్ సాదిక్ , రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నారు. డీఎంకే ఎన్‌ఆర్‌ఐ విభాగానికి ఆఫీస్ బేరర్‌గా పనిచేశారు. అయితే డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో డీఎకే అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది. పరారీలో ఉన్న జాఫర్‌ను మార్చిలో ఎన్‌సిబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News