Tuesday, July 29, 2025

మైసూరులో రూ.380 కోట్లకు డ్రగ్స్‌ పట్టివేత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మైసూరులో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న ముఠాను ముంబై పోలీసులు పట్టుకున్నారు. మైసూరు ఔటర్ రింగ్ రోడ్డులో సమీపంలో ఉన్న మాదకద్రవ్యాల తయారీ కర్మాగారంపై మైసూరు పోలీసులతో కలిసి మహారాష్ట్ర పోలీసులు దాడి చేసి 187 కిలోల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.380 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఇక్కడ తయారు చేసిన డ్రగ్స్ ను మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు నరసింహరాజ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ తలవార్‌ను మైసూరు నగర కమిషనర్ సస్పెండ్ చేశారు.

కాగా, ఇటీవల మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఒక మాదకద్రవ్యాల వ్యాపారి తాను మైసూరు నుండి డ్రగ్ర్ సేకరిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. మైసూరులో పెద్ద మొత్తంలో MDMA పౌడర్, మాత్రల రూపంలో నిల్వ చేశారని.. దానిని మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారని అతను పోలీసులకు చెప్పాడు. దీంతో మహారాష్ట్ర పోలీసులు, మైసూరు నగర పోలీసు కమిషనర్ సీమా లట్కర్‌ను సంప్రదించారు. అనంతరం పోలీసు బృందం ఔటర్ రింగ్ రోడ్డులోని బెలవత్త సమీపంలో ఉన్న పాత గ్యారేజీపై దాడి చేసి డ్రగ్స్ ముఠాను పట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News