Saturday, September 21, 2024

దువ్వాడకు షాకిచ్చిన జగన్

- Advertisement -
- Advertisement -

టెక్కలి: దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయతీ రచ్చకెక్కడంతో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆయనను టెక్కలి నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జీ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో పేరాడ తిలక్ ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి), మాజీ ఎంఎల్ సి వేంపల్లి సతీశ్ రెడ్డి(పులివెందుల), మాజీ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర రెడ్డి(చంద్రగిరి)లను నియమించారు.

ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి ఆళ్ల నాని ఇటీవల రాజీనామా చేయడం వల్ల ఆయన స్థానంలో కైకలూరు మాజీ ఎంఎల్ఏ దూలం నాగేశ్వర రావును నియమించారు. వైసిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా జక్కంపూడి రాజా, బిసి విభాగం అధ్యక్షుడిగా రమేశ్ యాదవ్, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎంఎల్ఏ టిజెఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడుగా గంటజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా పానుగంటి చైతన్యను పార్టీ నియమించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News