Wednesday, February 12, 2025

మాది ముగ్గురు సభ్యుల వ్యవస్థ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్నికల కమిషన్ (ఇసి)ని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్ నడుపుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చేసిన ఆరోపణలను ఇసి మంగళవారం తిప్పికొట్టింది. తమది ముగ్గురు సభ్యుల సంస్థ అని ఇసి సుస్పష్టం చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌ను అపఖ్యాతి పాలుజేయడానికి ఆప్ ‘పదే పదే ఉద్దేశపూర్వకంగా పాల్పడుతున్న ఒత్తిడి ఎత్తుగడలను’ తాము ఉమ్మడిగా గమనించామని ఇసి తెలియజేసింది. ఇసి ఏక సభ్య సంస్థ అనే అభిప్రాయాన్ని సృష్టిస్తున్నారని కమిషన్ విమర్శించింది.‘రాజ్యాంగబద్ధమైన సంయమనం పాటించాలని తాము నిర్ణయించుకున్నామని, అటువంటి విమర్శలను తెలివిగా దిగమింగుకుంటున్నామని, అటువంటి నిందారోపణలకు ప్రభావితం కారాదని నిర్ణయించుకున్నామని ఇసి ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌లో తెలిపింది. బిజెపి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనను ఇసి అలక్షం చేస్తోందని ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ సహా పార్టీ అగ్ర నాయకులు ఆరోపించారు.

రిటైర్‌మెంట్ అనంతర బాధ్యత స్వీకారం ఉద్దేశంతో రాజీవ్ కుమార్ బిజెపిపై చర్య తీసుకోవడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. రాజీవ్ కుమార్ 65వ ఏట ప్రవేశించిన మీదట ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు ఇతర ఎన్నికల కమిషనర్లు.‘ఇసిఐ ఏక సభ్య సంస్థ అన్నట్లుగా ఢిల్లీ ఎన్నికల్లో ఇసిఐని అపఖ్యాతి పాలుజేయడానికి పదే పదే పాల్పడుతున్న ఒత్తిడి ఎత్తుగడలను ముగ్గురు సభ్యుల కమిషన్ ఉమ్మడిగా గమనించింది, అటువంటి విమర్శలను తెలివిగా దిగమింగుకుంటూ రాజ్యాంగబద్ధమైన సంయమనం పాటించాలని, అటువంటి నిందారోపణలకు ప్రభావితం కారాదని నిర్ణయించుకున్నాం’ అని ఎన్నికల కమిషన్ తన ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేసింది. కమిషన్ ఈ విధంగా స్పందించడం అరుదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఆప్ అధికారం నిలబెట్టుకోవాలని ఆశిస్తుండగా, తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బిజెపి వాంఛిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News