Monday, September 15, 2025

కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఇడి, ఐటి సోదాలు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఇడి, ఐటి సోదాలు నిర్వహించింది. మైనింగ్ అక్రమాలపై ఇడి, ఐటి జాయింట్ ఆపరేషన్ చేసింది. కరీంనగర్, హైదరాబాదులో సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 30 ప్రాంతాల్లో ఐటి,ఈడి సోదాలు నిర్వహిస్తోంది. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై గతంలోనే సిబిఐ కేసు నమోదు చేశారు. సిబిఐతో పాటు ఇడిలో గ్రానైట్ అక్రమాలపై కేసు నమోదు చేశారు. కమాన్ ప్రాంతంలో అరవింద్ గ్రానైట్ యజమాని అరవింద్ వ్యాసి ఇంట్లో సోదాలు చేపడుతోంది. రాజేంద్రనగర్ హైదర్ గూడ జనప్రియ అపార్ట్‌మెంట్ లో ఐటి, ఇడి సోదాలు చేపడుతోంది. నాలుగవ అంతస్తులో ఉన్న గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ కార్యాలయంలో అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తుంది. కేటుగాళ్లు తక్కువ పరిమాణం చూపి ఎక్కువ గ్రైనేట్ కొనుగోలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News