Saturday, August 2, 2025

ఫాల్కన్ స్కామ్‌లో ఆస్తులు అటాచ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫాల్కన్ స్కామ్ కేసులో ఇడి దూకుడు పెం చింది. ఈ కేసులో క్యాపిటల్ ప్రొటక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఇడి దర్యాప్తులో భాగంగా రూ.18.14 కోట్ల విలువైన 12 స్థిరాస్తులను అటాచ్ చేస్తున్నట్లుగా ఇడి పేర్కొంది. అమర్‌దీప్ కుమార్ నేతృత్వంలోని మెస్స ర్స్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.792 కోట్లు మోసం చేసినట్లుగా ఇడి విచారణలో గుర్తించింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రజలను మోసం చేసినట్లుగా ఇడి అభియోగాలను మోపింది. మోసపూరితంగా పొందిన నిధులతో నిందితులు అనేక కంపెనీల ఈక్వీటీ షేర్లలో పెట్టుబడిగా ఉపయోగించారని, కంపెనీలకు రుణాలు, ప్రైవేట్ జెట్ విమానం కొనుగోలు, క్యాసినోలలో పెట్టుబడులు పెట్టారని అమర్‌దీప్ కుమార్, అతడి కుటుంబసభ్యుల పేరిట స్థిరాస్తులు కొనుగోలు చేశారని ఇడి దర్యా ప్తులో తేలింది. ఇడి అటాచ్ చేసిన స్థిరాస్తులు అమర్‌దీప్ కుమార్, అతడి కుటుంబసభ్యులు, మెస్సర్స్ రెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ రెట్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్నాయి.

మార్చి 7వ తేదీన సోదాలు నిర్వహించిన సందర్భంగా అమర్‌దీప్ కుమార్ కొనుగోలు చేసిన ప్రైవే ట్ జెట్ ‘హాకర్ 800ఎ’ను ఇడి స్వాధీనం చేసుకుంది. ఫాల్కన్ కంపెనీ దేశవ్యాప్తంగా 7056 మంది నుంచి దాదాపు 4,215 కోట్లను సేకరించింది. అయితే వీటిలో 792 కోట్లు 4065 మందికి తిరిగి చెల్లించక పోవడంతో మోసం జరిగినట్లు తేలింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్ అభివృద్ధి చేశారు. నకిలీ డీల్స్, నకిలీ రసీదులు, నకిలీ ఒప్పందాలు! మొత్తం నకిలీ స్కెచ్‌తోనే డబ్బులు వసూలు చేశారు. తొలుత హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వాటిని ఆర్థిక నేరాల విభాగానికి అప్పగించారు. తర్వాత కేసును సిఐడికి అప్పగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫాల్కన్ కంపెనీపై 8 కేసులు నమోదై ఉన్నాయి. అసాధ్యమైన లాభాలు వాగ్దానం చేసే ఆన్‌లైన్ స్కీమ్‌లను నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. సాంకేతికతను వాడుకుంటూ మోసాలు చేసే వాటిని ముందుగానే గుర్తించాలంటున్నారు. డబ్బు పెట్టుబడి పెట్టే ముందు ధృవీకరణ చేయడం తప్పనిసరి అంటున్నారు హెచ్చరిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News