Wednesday, December 4, 2024

తెలంగాణలో పీజీ మెడికల్ సీట్ల కుంభకోణం

- Advertisement -
- Advertisement -

పీజీ మెడికల్ సీట్ల కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలంగాణలోని మెడికల్ కాలేజీయాజమాన్యాలకు భారీ షాక్ ఇచ్చారు. భారీగా మెడికల్ కాలేజీల ఆస్తులను సీజ్ చేశారు. మొత్తం రూ.9.71 కోట్ల విలువైన ఆస్తులను ఇడి అధికారులు అటాచ్ చేశారు. అందులో బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డికి కాలేజీకి చెందిన రూ.2.89 కోట్లను ఫ్రీజ్ చేశారు. ఎమ్‌ఎన్‌ఆర్ మెడికల్ కాలేజీకి చెందిన రూ.2.01 కోట్లను సీజ్ చేశారు. చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీకి చెందిన రూ.3.33 కోట్లను అటాచ్ చేసినట్లు

శుక్రవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. మేనేజ్‌మెంట్ కోటాలో పిజి మెడికల్ సీట్లను బ్లాక్ చేసినట్లు గుర్తించారు. నీట్ పరీక్షలో టాప్ ర్యాంకర్ల సర్టిఫికెట్లతో సీట్లు బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు. కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ వరంగల్ మట్టెవాడ పిఎస్‌లో ఈ విషయమై గతంలో ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదు ఆధారంగా ఇడి కేసు నమోదు చేసింది. గతేడాది జూన్‌లో తెలంగాణలో 16 చోట్ల ఇడి సోదాలు నిర్వహించింది. మల్లారెడ్డి కళాశాలల్లో సోదాల్లో రూ.1.04 కోట్లు నగదు స్వాధీనం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News