మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గొర్రెల స్కామ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. గొర్రెల స్కామ్ కేసులో బాధితులకు ఇడి నోటీసులు ఇచ్చింది. ఈనెల 15న ఇడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఎపికి చెందిన రైతుల నుంచి గొర్రెలు కొనుగోలు చేసి వారికి దళారి వ్యాపారి మొయినుద్దీన్ డబ్బులు చెల్లించలేదు. రైతులకు చెల్లించాల్సిన డబ్బును బినామీ ఖాతాలకు మొయినుద్దీన్ బదిలీ చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై రైతులకు దక్కాల్సిన నిధులు స్వాహా చేశారని ఇందులో పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారులు, మాజీ మంత్రి తలసాని ఒఎస్‌డి పైనా కూడా కేసులు నమోదయ్యాయి. రూ.2.1 కోట్ల మేర అక్రమాలు జరిగాయనే కోణంలో అవినీతి నిరోధకశాఖ ప్రారం భించిన దర్యాప్తులోనే దాదాపు రూ.700 కోట్ల మేర స్కామ్ జరిగిందని ప్రాథమికంగా వెల్లడైంది. ఎసిబి విచారణ ఆధారంగా ఈ కేసులోకి ఇడి రంగ ప్రవేశం చేసింది. ఈ స్కామ్ లో రూ.1,000 కోట్లకుపైగా దారి మళ్లి ఉంటాయనే ఇడి అంచనా వేసింది. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు రూ.2 కోట్లు ఎగవేసిన బ్రోకర్లు ప్రభుత్వ పథకం నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారితో అధికారులు సైతం చేతులు కలిపి కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఎసిబి ఆరోపిస్తోంది. గొర్రెలు కొనకుం డానే కొన్నట్టు రికార్డులు తయారీ చేశారని, వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఎసిబి పేర్కొంది.
గొర్రెల స్కామ్‌లో బాధితులకు ఇడి నోటీసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -