Monday, July 15, 2024

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో రణబీర్ కపూర్‌కు ఇడి సమన్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో అక్టోబర్ 6న తమ ఎదుట హాజరుకావాలంటూ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం సమన్లు జారీచేసింది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు సోషల్ మీడియా ప్రచారకర్తగా రణబీర్ కపూర్ వ్యవహరిస్తున్నారు. యాప్‌కు సంబంధించిన ప్రచార కార్యకలాపాల కోసం రణబీర్‌కు చెల్లింపులు అందినట్లు తెలుస్తోంది.

యుఎఇలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుని విధ దేశాలలో ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహదేవ్ ఆన్‌లైన్ బుక్ ఆప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ నెట్‌వర్క్‌లపై కోల్‌కత, భోపాల్, ముంబైతోసహా అనేక నగరాలలో ఇడి సోదాలు నిర్వహిస్తోంది. బెట్టింగ్ యాప్ ద్వారా హవాలా కార్యకలాపాలు సాగుతున్నట్లు ఇడిఅనుమానిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News