Sunday, May 4, 2025

ఈటెలకు షాక్ ఇచ్చిన హైకోర్టు.. అక్కడే తేల్చుకోవాలని..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి ఎంపి ఈటెల రాజేందర్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈటెలపై నమోదైన ఓ కేసును కొట్టివేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. కానీ, కేసును కొట్టివేయడం కుదరదని హైకోర్టు ఈటెల పిటిషన్‌ను కొట్టివేసింది. అసలేం జరిగిందంటే.. ఘట్‌కేసర్‌లోని కొర్రెములలో శ్రీహర్ష కన్‌స్ట్రక్షన్ సెక్యూరిటీ గార్డుపై ఈటెల చేయి చేసుకున్నారని అభియోగం ఉంది. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదుతో పోచారం ఐటి కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసును కొట్టి వేయాలని ఈటెల కోర్టును ఆశ్రయించారు. కానీ, కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే పోలీసులు కేసు నమోదు చేశారని.. ఈ దశలో కేసును కొట్టేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూరట్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కేసును కొట్టి వేసేందుకు నిరాకరించింది. కేసు గురించి కింది కోర్టులోం తేల్చుకోవాలని సూచిస్తూ.. పిటిషన్‌ను కొట్టివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News