Home జాతీయ వార్తలు ఎన్నికల సర్వేలు ఫెయిల్ అవుతాయి : అఖిలేష్

ఎన్నికల సర్వేలు ఫెయిల్ అవుతాయి : అఖిలేష్

Election survey fail Says Akhilesh Yadav

లఖ్‌నవూ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వస్తున్న సర్వేలు అన్నీ అవాస్తవమని ఎన్నికల ఫలితాల అనంతరం నిరూపితమవుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత , ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం వస్తున్న ఒపీనియన్ పోల్స్ సర్వేల్లో ఉత్తరప్రదేశ్‌లో మరోసారి బిజెపి అధికారం లోకి వస్తుందని, చెబుతున్నాయన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెజార్టీ తగ్గినప్పటికీ బిజెపి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని వెల్లడిస్తున్నాయన్నారు. అయితే ఎన్నికల తరువాత వచ్చే ఫలితాలు ఈ సర్వేలకు భిన్నంగా ఉంటాయని ఆయన జోస్యం చెప్పారు.