Sunday, May 5, 2024

కుట్రతోనే ఎలక్టొరల్ బాండ్లు

- Advertisement -
- Advertisement -

కుట్రతోనే ఎలక్టొరల్ బాండ్లు
ప్రభుత్వాల కూల్చివేతకు దోపిడీ కుంభకోణం
పార్టీల విభజనకూ ఒక పావుగా వాడారు
జోడో న్యాయ్ యాత్రలో రాహుల్
బిజెపి ప్రభుత్వంపై నిశిత విమర్శ
ఠాణె : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శనివారం బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శల స్థాయి పెంచారు. ఎలక్టొరల్ బాండ్లను ప్రభుత్వాల కూల్చివేతకు, రాజకీయ పార్టీల విభజనకు ఉపయోగించిన దోపిదీ కుంభకోణంగా రాహుల్ అభివర్ణించారు. ముంబయికి వెళుతూ తన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఠాణెలోని జంభాలి నాకాలో జనాన్ని ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ, ‘ఎలక్టొరల్ బాండ్ల పథకం ఒక అంతర్జాతీయ స్థాయి దోపిడీ కుంభకోణం.

దానిని నిరసించేవారిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), కేంద్ర నేరపరిశోధక సంస్థ (సిబిఐ) వెంటాడుతుంటాయి’ అని ఆరోపించారు. ‘ప్రతిపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాల కూల్చివేతకు, రాజకీయ పార్టీల విభజనకు వినియోగించే ఒక దోపిడీ కుంభకోణం అది’ అని రాహుల్ విమర్శించారు. ‘మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఎంఎల్‌ఎలు ఊరికే పారిపోయారని మీరు భావిస్తున్నారా?’ అని ఆయన ప్రశ్నించార. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ నాయకత్వంలో తిరుగుబాట్ల వల్ల ఆ రెండు పార్టీలలో వచ్చిన చీలికలను రాహుల్ ఆ విధంగా ప్రస్తావించారు.

వెనుకబడిన తరగతులు (బిసిలు), దళితులు, ఆదివాసీలు మైనారిటీలు, సాధారణ కేటగరీలోని నిరుపేదలు జనాభాలో 80 శాతం ఉంటారని, కాని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉన్నత స్థానాలలో వారికి నామమాత్రంగానే ప్రాతినిధ్యం ఉందని ఆయన చెప్పారు. మహమ్మారి సమయంలో దేశంలో కొవిడ్ 19 వల్ల 50 లక్షల మంది చనిపోయారని రాహుల్ తెలియజేశారు. ‘కరోనా వైరస్ వల్ల జనం మరణిస్తుంటే వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎలక్టొరల్ బాండ్ల రూపంలో ప్రధాని మోడీకి డబ్బు విరాళంగా ఇచ్చిందని ఆయన ఆరోపించారు. అయోధ్య రామ్ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి సినీ స్టార్లు, అగ్ర శ్రేణి పారిశ్రామికవేత్తలు మాత్రమే అతిథులుగా హాజరయ్యారని, కాని అక్కడ నిరుపేదలు లేరని రాహుల్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News