Sunday, September 15, 2024

త్వరలో తెలంగాణ ఆర్‌టిసిలో ఎలక్ట్రిక్ బస్సులు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఆర్‌టిసి త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెట్టబోతోంది. ముందుగా ఈ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను కరీంనగర్‌-హైదరాబాద్, నిజామాబాద్ -హైదరాబాద్ మార్గాలలో నడపాలని ఆర్‌టిసి నిర్ణయించింది. ఈ-సూపర్ లగ్జరీ పేరుతో తీసుకు రానున్న ఈ బస్సులు ఇప్పటికే కరీంనగర్ డిపోకు 35, నిజామాబాద్ డిపోకు 13 బస్సులు చేరుకున్నాయి. ఈ బస్సులను ఆర్‌టిసి ప్రైవేట్ సంస్థ నుండి అద్దెకు తీసుకుంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో సిటీ బస్సులుగా, హైదరాబాద్-విజయవాడ మధ్య అంతరాష్ట్ర సర్వీసులుగా ఎలక్ట్రిక్ బస్సులను ఆర్‌టిసి నడిపిస్తోంది.

ఈవన్నీ మెట్రో డీలక్స్ బస్సులు కాగా ప్రస్తుతం సూపర్ లగ్జరీ బస్సులను నడిపించబోతున్నారు. త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఆర్‌టిసిలో కాలం చెల్లిన బస్సులు ఎక్కువగా ఉండటంతో వీటి నిర్వహణకే అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అటు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొత్త బస్సులు కూడా కొనుగోలు చేయలేక పోతోంది. ఈ బస్సుల్లో డ్రైవర్లుగా బస్సు తయారీదారు సిబ్బందే ఉండగా, కండక్టర్లుగా మాత్రం ఆర్‌టిసి సిబ్బంది ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News