Friday, April 26, 2024

విద్యుత్ వినియోగంలో రికార్డ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగ డిమాండ్ రికార్డుస్థాయిలో పెరిగింది. శనివారం మధ్యాహ్నం నాటికి ఏకంగా 14,649 మెగావాట్లకు విద్యుత్ వినియో గం చేరుకొంది. ఇంతటి భారీ విద్యుత్ ను వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం సి ద్దించేనాటికి విద్యుత్ వినియోగం కేవలం 6666 మెగావాట్లుండేది. కానీ నేడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల మూలంగా కరెం టు వినియోగం రికార్డుస్థాయిలో 14,649 మెగావాట్లకు పెరిగిందని, ఇది దేశంలోనే అరుదైన రి కార్డు అని ఆ శాఖ అధికారవర్గాలు పేర్కొంటున్నా యి. వ్యవసాయం, పరిశ్రమలు, ఐటి, ఫార్మా, వా ణిజ్య సముదాయాలు, గృహ వినియోగం తదితర అన్ని రంగాల్లో విద్యుత్ కనెక్షన్లు కూడా రికార్డుస్థాయిలో పెరగడంతోనే కరెంట్ వాడకం కూడా భారీ గా పెరిగిందని వివరించారు.

ప్రస్తుతం దేశంలో విద్యుత్‌ను అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో మొదటిస్థానంలో ఉన్న తమిళనాడు మె గావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తోంది. చిన్నచిన్న అవాంతరాలు మినహా రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రంగాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని విద్యుత్తుశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న వేసవిలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు వినియోగ డిమాండ్ ఏకంగా 17 వేల మెగావాట్లకు చేరుకుంటుందని ఉన్నతాధికారులు అంచనా వేశారు. అయితే రాష్ట్రంలో థర్మల్, జల విద్యుత్తు, సోలార్ తదితర విద్యుత్తు ఉత్పత్తి కేం ద్రాల నుంచి ఉత్పత్తి చేసే కరెంటుకు తోడుగా ఎన్‌టిపిసి, సింగరేణి నుంచి మాత్రమే కాకుండా ఇత ర రాష్ట్రాల నుంచి కూడా విద్యుత్‌ను కొనుగోలు చే సైనా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని కొందరు సీనియర్ అధికారులు ధీమాగా చెబుతున్నారు.

దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటుగా మీడియం టర్మ్ కొనుగోలు ఒప్పందాలు సకాలంలోనే కుదుర్చుకొన్నామని, దాంతో విద్యు త్ కొరత సమస్య అనేదే లేకుండా చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశామని ఆ అధికారులు వివరించారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి 10,410 మెగావాట్లు, జల విద్యుత్తు కేంద్రాల నుంచి 2,510 మెగావాట్లు, సోలార్ తదితర సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి 4,300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థం ఉందని, మొత్తం కలిపి రాష్ట్రంలో 17,228 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్ధం ఉందని, అయితే అందులో అన్ని విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తిని చేయలేకపోవచ్చునని, అందుచేతనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల నుంచి సుమారు మూడు వేల మెగావాట్లను తీసుకునే ఏర్పాట్లు చేసుకున్నామని ఆ అధికారులు వివరించారు.
27.1 లక్షలకు పెరిగిన వ్యవసాయ కనెక్షన్లు
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఉచితంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న పథకాన్ని ప్రవేశపెట్టడంతో రికార్డుస్థాయిలో విద్యుత్తు కనెక్షన్లు పెరిగాయి. 2014వ ఏడాదిలో 18.4 లక్షలున్న వ్యవసాయ కరెంటు కనెక్షన్లు 2023 నాటికి ఏకంగా 27.10 లక్షలకు పెరిగాయి. అంటే అదనంగా 9 లక్షల విద్యుత్తు కనెక్షన్లు పెరిగాయి. అన్ని రంగాల్లో కలిపి రాష్ట్రంలో 2014లో ఒక కోటి 16 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉండగా ఆ సంఖ్య నేటికీ ఒక కోటి 80 లక్షలకు పెరిగింది. ఈ పెరుగుదలో హైదరాబాద్ నగరం (జిహెచ్‌ఎంసి)లో 15 శాతం అధికంగా ఉంది. ఒక్క జిహెచ్‌ఎంసి పరిధిలోని ఐటి, ఫార్మా, గృహ విద్యుత్తు రంగాల్లోనే ఏకంగా 6 లక్షల విద్యుత్తు కనెక్షన్లు పెరిగాయని కొందరు అధికారులు వివరించారు.

ఇందులో డేటా సెంటర్ల కరెంటు వినియోగం భారీగా ఉంటోందని, ఒక్కొక్క సంస్థ కనీసం 30 మెగావాట్ల సామర్థం ఉన్న సబ్-స్టేషన్లను ఏర్పాటు చేసుకొన్నాయని, అందులో ఒక్క అమెజాన్ సంస్థకే ఏకంగా 6 సబ్‌స్టేషన్లు ఉన్నాయని వివరించారు. ఇవి కాకుండా హైటెన్షన్ విద్యుత్తు (హెచ్‌టి) కనెక్షన్లు 2014లో కేవలం 9,507 ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 15,123కు పెరిగిందని తెలిపారు. అంటే ఈ రంగంలో సంఖ్య తక్కువే అయినప్పటికీ విద్యుత్తు వినియోగం భారీగా ఉంటుందని, ఈ కంపెనీల కరెంటు బిల్లులే కోట్లాది రూపాయల్లో ఉంటాయని ఆ అధికారులు వివరించారు. ఇలా అన్ని కంపెనీల కరెంటు వాడకం భారీగా పెరిగిందని, అందుకే శీతాకాలమైనప్పటికీ గత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా సాధారణ స్థాయి కంటే 15 శాతం విద్యుత్తు వినియోగం పెరిగిందని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి చేపట్టిన అనేక సంస్కరణల మూలంగా పరిశ్రమలు భారీగా ఏర్పడ్డాయని, దాంతో పరిశ్రమల విద్యుత్తు కనెక్షన్ల సంఖ్య 85 వేల నుంచి ఒక లక్షా 15వేలకు పెరిగాయని, అంటే 85 వేల పరిశ్రమల సంఖ్య కాస్తా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాల మూలంగా ఒక లక్షా 15 వేలకు పెరిగాయని తెలిపారు. ఇక గృహ వినియోగదారులు భారీగా పెరిగారని, విద్యుత్తు కనెక్షన్లు కూడా భారీగానే పెరిగాయని, 2014లో రాష్ట్రంలో గృహ విద్యుత్తు కనెక్షన్లు 85 లక్షల 18 వేలు ఉండగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆ సంఖ్య ఒక కోటి 30 లక్షలకు పెరిగిందని వివరించారు. అందుకే విద్యుత్తు వినియోగ డిమాండ్ 6,666 మెగావాట్ల నుంచి రికార్డుస్థాయిలో 14,649 మెగావాట్లకు పెరిగిందని వెల్లడించారు. విద్యుత్తు వినియోగ డిమాండ్ ఎంత ఎక్కువగా పెరిగినా అందుకు తగినట్లుగా నాణ్యమైన కరెంటును సరఫరా చేసేందుకు సకల ఏర్పాట్లు చేసుకున్నామని ఆ అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News