Saturday, March 2, 2024

ఢిల్లీలో కరెంటు చిచ్చు!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గొడవలు ఇప్పట్లో చల్లారే టట్లు లేవు. నిన్న, మొన్నటి వరకూ మద్యం పాలసీ విధాన రూపకల్పనలో కుంభకోణం జరిగిందనే నెపంతో ఢిల్లీ రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆప్ ప్రభుత్వాన్ని వెంటాడి, వేధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా విద్యుత్ ధరలను పెం చేందుకు నిర్ణయించిందనే అంశంపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. ఢిల్లీ రాష్ట్రంలో విద్యుత్ కంపెనీలు విద్యుత్తు కొనుగోళ్ళ అడ్జస్ట్‌మెంట్ ఛార్జీల ను పెంచేందుకు ఢిల్లీ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతులు మం జూరు చేయడంపై ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అతిషి తీవ్రస్థాయిలో మం డిపడ్డారు. ఢిల్లీ రాష్ట్రంలో విద్యుత్తును ఖరీదైనదిగా మార్చేందుకు కేంద్ర ప్రభు త్వం కుట్ర చేస్తోందని, దీంతో విద్యుత్తు వినియోగదారులపై (ఢిల్లీ రాష్ట్ర ప్రజలు) అదనపు భారం పడుతుందని ఆ రాష్ట్ర విద్యుత్తు శాఖామంత్రి అతిషి ధ్వజమెత్తారు.

విద్యుత్తును ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్తు కేంద్రాలు ఎందుకు అధికధరలకు బొగ్గును కొనుగోలు చేయాల్సి వస్తుందో ఢిల్లీ రాష్ట్ర ప్రజలకు, త ద్వారా దేశ ప్రజలకు వివరించాలని మంత్రి అతిషి డిమాండ్ చేశారు. విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన బొగ్గును వినియోగించే క్రమంలో కనీసం 10 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న బొగ్గును కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభు త్వ పెద్దలు వత్తిడి చేస్తున్నారని ఢిల్లీ మంత్రి అ తిషి ఆరోపించారు. దేశంలోని బొగ్గు గనుల నుంచి కొనుగోలు చేస్తున్న బొగ్గు కారు చౌక గా దొరుకుతుండగా విదేశాల నుంచి దిగుమ తి చేసుకొన్న బొగ్గు ఏకంగా పది రెట్లు అధికంగా ధరలు ఉన్నాయని, అందుబాటులో కా రుచౌవకగా ఉన్న ధరలకు కొనుగోలు చేస్తా రా? లేక అధిక ధరలకు కొనుగోలు చేస్తారా? అని మంతి అతిషి ప్రశ్నించారు. దేశంలోని బొగ్గు గనుల నుంచి కొనుగోలు చేసే టన్ను ధర కేవలం రెండు వేల రూపాయల నుంచి గ రిష్టంగా 2,800 రూపాయల వరకూ ఉం దని, ఇలాంటి ధరలకు కాకుండా ఏకంగా 25 వేల రూపాయలకు టన్ను బొగ్గును ఎవ్వరైనా కొనుగోలు చేస్తారా? అని ఆ మంత్రి నిలదీశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పాలన సాగిస్తుందో అర్ధం చేసుకోవాలని కో రారు. తమ ఆదేశాలను వినకపోతే బ్లాక్‌మెయిల్ చేయడం, ఏవో కొన్న అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడం వం టి చేస్తున్న బిజెపి ప్రభుత్వ ఆగడాలను గమనించాలని మంత్రి కోరారు.
తెలంగాణ దారిలో ఢిల్లీ సర్కార్
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం దారిలో పయనిస్తోందనే చర్చ జాతీయస్థాయిలో జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు, హితుడు అయిన అదాని కంపెనీ నుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న ఖరీదైన బొ గ్గును కొనుగోలు చేసేది లేదని కరాఖండిగా చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అని, బొగ్గు కొనుగోళ్ళ గోల్‌మాల్ ను బయటపెట్టడమే కాకుండా జాతీయస్థాయిలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ బండారా న్ని బయటపెట్టిన కెసిఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని రాష్ట్రాలూ గుర్తుకు తెచ్చుకొంటున్నాయ ని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తుశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్ర జెన్కో అధికారులు ఒక్క టన్ను బొగ్గును కొనుగోలు చేయడానికి కేవలం 2500 రూపాయల నుంచి గరిష్టంగా 2800 రూపాయలను మాత్రమే ధర ఉండగా దాన్ని పక్కనబెట్టి ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పాడని ఒక టన్ను బొగ్గుకు 30 వేల రూపాయలను చెల్లించి కొనుగోలు చేయాలా? అని మొదట్లోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఎదురు తిరిగారని, అందుకు కెసిఆర్‌ను, ఆయన కుటుం బ సభ్యులను అక్రమ కేసులతో వేధించిన అంశాలు ప్రస్తుతం జాతీయస్థాయిలో చర్చ జరుగుతోందని ఆ అధికారులు వివరించారు.

ప్రధాని చెప్పినట్లుగా అదానీ బొగ్గును కొనుగోలు చేయలేదనే కోపంతోనే కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్ధికంగా నష్టపరిచారని, వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టాలనే ఆంక్షలు విధించిన వాటిని అమలు చేయలేదనే నెపంతో ఏకంగా అయిదు వేల కోట్ల రూపాయల నిధులను ని లిపి వేసిందని ఆ అధికారులు గుర్తు చేశారు. అంతేగాక తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా, ధర్మంగా, చట్టపరంగా రావాల్సిన నిధుల్లో ఏ కంగా ఒక లక్షా 35 వేల కోట్ల రూపాయలను రాకుండా చేసి తీవ్రస్థాయిలో నష్టపరిచిందని, అయినప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతాంగానికి ఎలాంటి నష్టాలు, ఇబ్బందులు కలుగకూడదనే సదుద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయలేదని వివరించారు. కేం ద్రం తీసుకొచ్చిన లోపభూయిష్టమైన విద్యు త్తు సంస్కరణలను మొట్టమొదటిసారి వ్యతిరేకించింది ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమేనని, ఆ సమయంలో దేశంలోని ప్ర ధాన రైతు ఉద్యమ నేతలు మాత్రమే మద్దతు గా నిలిచారని, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసిరాలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

తన దాకా వస్తే గానీ నొప్పి తెలియదన్నట్లుగా ఇప్పుడు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఆంక్షలు వి ధించడం, వేధింపులకు పూనుకోవడంతో గ తంలో కెసిఆర్ చెప్పిన మాటలు వారికి గుర్తు కు వచ్చాయని తెలిపారు. రానున్న కొద్ది రోజుల్లోనే విదేశీ బొగ్గు కొనుగోళ్ళకు వ్యతిరేకంగా బిజేపీయేతర రాష్ట్రాలన్నీ ఏకమై ధిక్కారించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఆ మేరకు అన్ని రాష్ట్రాలూ విదేశీ బొగ్గు కొనుగోళ్ళకు వ్యతిరేకతను వ్యక్తంచేయడానికి కసరత్తులు చేస్తున్నాయని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారని ఆ అధికారులు వివరించారు. ఈ వ్యవహారం చి లికి చిలికి గాలివానగా మారి మోడీ మెడకు చుట్టుకోవడమే కాకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఇది ప్రధాన ప్రచారాస్త్రం కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News