Saturday, May 4, 2024

ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా

- Advertisement -
- Advertisement -

‘అత్యంత తీవ్రమైన టెస్లా ఆబ్లిగేషన్ల’ కారణంగా భారత్‌లో తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు అమెరికన్ టెక్ కోటీశ్వరుడు ఎలాన్ మస్క్ శనివారం వెల్లడించారు. విద్యుత్ కార్ తయారీ సంస్థ టెస్లా సిఇఒ మస్క్ ఆది, సోమవారాల్లో భారత్‌ను సందర్శించి, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావలసి ఉంది. కానీ మస్క్ పర్యటన వాయిదా వేసుకోవలసి వచ్చింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో భారత్‌కు రావాలని ఆశిస్తున్నట్లు మస్క్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. ‘దురదృష్లవశాత్తు అత్యంత తీవ్రమైన టెస్లా ఆబ్లిగేషన్ల వల్ల భారత్‌లో పర్యటన ఆలస్యం అవుతోంది. అయితే, ఈ ఏడాది ద్వితీయార్ధంలో సందర్శన కోసం ఆత్రుతతో ఎదురుచూస్తు అని మస్క్ ‘ఎక్స్’లో రాశారు.

ఈ నెల 23న టెస్లా ఆదా యం సమావేశానికి తాను హాజరు కావలసి ఉన్నందున 21, 22 తేదీల్లో భారత్ పర్యటన ప్లాన్‌ను వాయిదా వేయవలసి వచ్చింది అని ఆయన వివరించారు. మస్క్ నిరుడు జూన్‌లో ప్రధాని మోడీని ఆయన అమెరికా పర్యటన సమయంలో కలుసుకున్నారు. టెస్లా త్వరలో భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుందనే దృఢనమ్మకాన్ని మస్క్ వ్యక్తం చేస్తూ 2024లో భారత్‌ను సందర్శించాలని అనుకుంటున్నట్లు తెలియజేశారు. మస్క్ ప్రతిపాదిత పర్యటన భారత్‌లో తన శాట్‌కమ్ సంస్థ స్టార్‌లింక్‌తో పాటు టెస్లా యూనిట్ ఏర్పాటు యోచనను ప్రకటిస్తారనే ఆశలను రేకెత్తించింది. దేశంలో టెస్లా కార్ల విక్రయానికి వీలుగా భారత్ దిగుమతి సుంకాన్ని తగ్గించాలని మస్క్ గతంలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News