Tuesday, April 23, 2024

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

- Advertisement -
- Advertisement -

Employment opportunities for unemployed youth

ప్రైవేటు రంగంలో 14లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మెగా జాబ్‌మేళాలు
రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి

మహేశ్వరం: రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలోని నిరుద్యోగయువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కేంద్రాలు జాబ్‌మేళాలు పెద్దఎత్తున ఏర్పాటు చేస్తుందని,గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఈఅవకాశాలను సద్వినియోగం చేసుకొని వారి కుటుంబాలకు బాసటగా నిలువాలని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో నిరుద్యోగ యువతకు డిఆర్‌డిఎ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగాజాబ్‌మేళాను ప్రారంభించారు. 810మంది నిరుద్యోగులు పాల్గొన్న మేళాలలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ… కరోనా మహమ్మారితో రెండేళ్లుగా ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు పరిశ్రమలు తీవ్ర ఒడిదుడుకులకు గురై ఆర్థిక రంగం దెబ్బతిని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత చిన్నభిన్నమైనందున వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు రంగంలో 14లక్షల ఉద్యోగాలు కల్పించడానికి నిర్ణయించినట్లు తెలిపారు.

గ్రామీణ పట్టణ గిరిజన తాండాల్లో ప్రతిభ కలిగిన అనేక మంది యువతి యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమై ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకుంటున్నారని త్వరలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుందని పేర్కోన్నారు. రంగారెడ్డి జిల్లాలో అనేక పరిశ్రమలు వస్తున్నందున ప్రతి నియోజకవర్గంలో జాబ్‌మేళాలు నిర్వహించి స్థానిక పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు అవకాశం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రైవేటు రంగంలో కూడా వారినైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో డిఆర్‌డిఎ ప్రాజెక్టుడైరెక్టర్ ప్రభాకర్ మహేశ్వరం ఎంపిపి కె.రఘుమారెడ్డి వైస్‌ఎంపిపి ఆర్ సునితాఅంద్యానాయక్ సర్పంచ్ కర్రోళ్లప్రియాంక రాజేష్ ఎంపిటిసి పి.సుదర్శన్‌యాదవ్ వివిధ పరిశ్రమలు సంస్థలకు చెందిన అధికారులు ప్రతినిధులు నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News