Monday, April 29, 2024

లవ్లీ రొమాంటిక్ మెలోడి..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ వేసవి సీజన్ లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌లో ఒకటిగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘మళ్ళీ మళ్ళీ’ పాట చార్ట్‌బస్టర్ హిట్ అయింది. శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘ఏందే ఏందే’ పాటని విడుదల చేశారు మేకర్స్. హిప్ హాప్ తమిళ ఈ పాటని లవ్లీ రొమాంటిక్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటకు రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సంజిత హెగ్డే, పద్మలత, హిప్ హాప్ కలసి ఈ పాటని చాలా శ్రావ్యంగా ఆలపించారు. అఖిల్ ఈ పాటలో కూల్ అండ్ స్టైలిష్ గా కనిపించారు. అఖిల్, సాక్షి వైద్యల కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి మునుపెన్నడూ చూడని అవతార్, క్యారెక్టర్‌లో అఖిల్‌ని ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News