క్వీన్ అనుష్క శెట్టి యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్‌ప్రభు మేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ.. ‘అనుష్కకు ఈ సినిమా కథ చెప్పగానే చాలా అడివెంచర్‌తో కూడుకున్న మూవీ తప్పకుండా చేద్దాం అని చెప్పింది. అనుష్క విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఈ కథ రాస్తున్నప్పుడే శీలావతి పాత్ర అనుష్క చేయాలని నేను, మా ప్రొడ్యూసర్ రాజీవ్, సాయిబాబా విక్రమ్, ప్రమోద్ వంశీ నిర్ణయించుకు న్నాం.
దేశిరాజు క్యారెక్టర్‌లో విక్రమ్ ప్రభుని ఊహించుకుని రాశాను. ఆయన ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తారు. ఇందులో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంచి సినిమా తీశాం. ఘాటి సినిమాలో ఒక అందమైన సోల్ ఉంది. ఆడియన్స్ ఆ సోల్‌ని మనసులో నింపుకుని వెళ్తారు’ అని అన్నారు. జగపతిబాబు మాట్లాడుతూ.. ‘అనుష్క స్వీటీ అని మనందరికీ తెలుసు కానీ. ఈ సినిమాల్లో చాలా ఘాటుగా ఉండబోతుంది. అన్ని రియల్ లొకేషన్స్‌లో చేసిన సినిమా ఇది’ అని తెలిపారు. హీరో విక్రమ్‌ప్రభు మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ క్రిష్.. దేశి రాజు క్యారెక్టర్‌లో నన్ను ఊహించుకొని రాయడం చాలా ఆనందాన్నిచ్చింది. అనుష్కకి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆమెతో కలిసి నటించడం చాలా ఆనందాన్నిచ్చింది. ఘాటీని అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిర్మాత రాజీవ్ రెడ్డి, చైతన్య రావు పాల్గొన్నారు.
Also Read : ‘ది ప్యారడైజ్’ కోసం హాలీవుడ్ కొలాబరేషన్