Sunday, May 12, 2024

నిబంధనల ప్రకారమే ఈఆర్‌సి పని చేస్తుంది

- Advertisement -
- Advertisement -

ఈఆర్‌సి కార్యదర్శి

మన తెలంగాణ / హైదరాబాద్:  రెగ్యూలరేషన్ చట్ట ప్రకారమే ఉత్తర్వులు ఇచ్చామనీ ఈఆర్సీ స్పష్టం చేసింది. ఉచిత విద్యుత్ పథకాలకు సంబంధించిన ఆరోపణలపై ఈఆర్సీ స్పందించింది. ఈమేరకు సోమవారం ఈఆర్సీ కార్యదర్శి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ చట్టం, 2003 ప్రకారం ఏర్పాటైన సంస్థగా చట్టానికి కట్టుబడి తన విధులను నిర్వర్తిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రయోజనం చేకూర్చే ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కమిషన్ గుర్తించిదని తెలిపారు. సబ్సిడీల నిర్వహణ, సున్నా బిల్లింగ్ ఆరోపణలకు సంబంధించి, ఎలక్ట్రిసిటీ యాక్ట్, 2003లోని సెక్షన్ 65 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీల ముందస్తు చెల్లింపును తప్పనిసరి అని పేర్కొన్నారు.

’గృహ జ్యోతి పథకం’ కింద లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తాలను సకాలంలో విడుదల చేయాలని, దీనికి అనుగుణంగా జీరో బిల్లులు జారీ చేయాలని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ఆదేశించినట్లు స్పష్టం చేశారు. కమిషన్ ఆదేశాలపై అప్పీల్ చేసే హక్కు సంస్థలకు ఉందని తెలిపారు. విద్యుత్ చట్టం, 2003లోని నిబంధనల ప్రకారం నిష్పక్షపాతంగా పనిచేయంలో ఈఆర్సీ చిత్తశుద్ది నిబద్ధతను శంకించేది లేదని ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ సంఘం (ఈఆర్‌సి)పై జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తం లేదన్న ఆయన నిబద్దతో,నిజాయితీతో పని చేస్తున్న సంఘంపై సోషల్ మీడియా చెడు ప్రచారం జరగడం చాలా బాధకరమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News