Monday, May 20, 2024

ఎంపీ మొయిత్రాకు ఎథిక్స్ కమిటీ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపీ మహువా మొయిత్రీపై వచ్చిన ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. అయితే టీఎంసీ ఎంపీ అభ్యర్థనమేరకు అక్టోబర్ 31కు బదులు నవంబర్ 2వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని కమిటీ కోరింది. నవంబర్ 2కు బదులు మరో రెండు రోజులు పొడిగించి నవంబర్ 5 తరువాత హాజరు కాడానికి అవకాశం ఇవ్వాలన్న మొయిత్రా అభ్యర్థనను కమిటీ తోసిపుచ్చింది. కారణం ఏదైనా ఈ అంశం తీవ్రత దృష్టా పొడిగించాలన్న మరో అభ్యర్థనను అంగీకరించబోమని కమిటీ స్పష్టం చేసింది. ఇది పార్లమెంట్ సహా సభ్యుల గౌరవంపై ప్రభావం చూపుతుందని కమిటీ పేర్కొంది.

తన పార్లమెంట్ నియోజక వర్గంలో ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన కార్యక్రమాల కారణంగా నవంబర్ 5 తరువాతనే హాజరవుతానని శుక్రవారం మొయిత్రా ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు. మొయిత్రా లేఖను పరిగణన లోకి తీసుకున్న లోక్‌సభ సెక్రటేరియట్ … ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ సోంకర్ ఆదేశాల మేరకు నవంబర్ 2న కమిటీ ముందు హాజరు కావాలని ఆమెకు లేఖ రాసింది. ఈ వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, జై అనంత్ దేహద్రాయ్ గురువారం ఎథిక్స్ కమిటీకి తమ మౌఖిక సాక్షాలను వివరించారు. అయితే తన వాదనను వినిపించడానికి తగిన అవకాశం ఇవ్వాలని మెయిత్రా పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News