Sunday, April 28, 2024

వన దేవత జనజాతర

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి నాలుగు రోజుల పాటు మేడారం జాతర

ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రెండు కోట్లకు పైగా భక్తులు సందర్శిస్తారని అంచనా
రూ.105 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను గిరిజన సాంప్రదాయాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 105 కోట్ల నిధులు మంజూరు చేశారు. తెలంగాణలో మహా కుంభమేళగా ప్రసిద్ధి చెందిన అతి పెద్ద గిరిజన జాతర రెండేళ్లకొకసారి మాఘ మాసంలో నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు తండోపతండాలాగు తరలి వస్తారు. ప్రతి ఏడాది భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 58 లక్షలకు పైగా భక్తులు తల్లులను దర్శించుకున్నారు. ఈ ఏడాది సుమారు రెండు కోట్లకు పైగా భక్తులు తల్లులను దర్శించుకోనున్నట్లు ప్రాథమిక అంచనా.

భక్తుల తాకిడికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మేడారంలో తాత్కాలిక ఏర్పాట్లతో పాటు ఈ ఏడాది శాశ్వత ఏర్పాట్ల పై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే భక్తులకు వివిధ శాఖల ద్వారా నివాసానికి ఉన్న షెడ్లతో పాటు అదనంగా షెడ్లను నిర్మించారు. వరంగల్ నుండి మేడారం మార్గంలో మూడు షెడ్లు ఒక్కోటి రూ.1.65 కోట్లతో నిర్మించారు. మేడారంలో తల్లులు గద్దెలకు చేరడానికి ముందు రోజు నుండి తిరిగి వనంలోకి వెళ్లేవరకు భక్తులు నాలుగు రోజుల పాటు గుడారాలు వేసుకొని అమ్మవార్ల సన్నిధిలో ఉండడం ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ. ఈ మేరకు గుడారాలతో భక్తులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం, జిల్లా యంత్రంగం ముందుచూపుతో మేడారంలో భక్తులు ఉండేందుకు నివాసానికి ఏర్పాట్లు చేశారు.

ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలను గౌరవిస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టి మహజతరకు సిద్ధంగా ఉంది. జాతర నిర్వహణకు. త్రాగు నీరు, మరుగుదొడ్లు, అదనపు స్నాన ఘట్టాలు, బ్యాటరీ ట్యాప్స్, అంతర్గత రోడ్లు, వైద్యం, వసతి, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, రహదారుల అభివృద్ధి , క్యూలైన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అనేక మార్లు పర్యటించి గత జాతర అనుభవాలను పరిగణనలోకి తీసుకొని లోపాలను సరిదిద్దుకుంటూ ఏర్పాట్లను విస్తృత పరిచారు. భక్తులకు సజావు దర్శనమే లక్ష్యంగా ప్రభుత్వ యత్రంగం ప్రత్యేక దృష్టి సారించి పక్కా ప్రణాళికతో జాతరకు ముందే అన్ని పనులు పూర్తి చేశారు.

జాతరకు ముందు ఏర్పాట్లను మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక శ్రద్ద తో పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేస్తూ పనులు పూర్తి చేశారు. ఉన్నతాధికారులు పలుమార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా మేడారం పర్యటించి పనులను పరిశీలించడంజాతరకు ఇచ్చిన ప్రాముఖ్యత ఏ పాటిదో అవగతమవుతోంది. రవాణా వ్యవస్థను నియంత్రించేందుకు యంత్రాంగం వాహనాల పార్కింగ్ స్థలాలను గద్దెల కు దూరంగా ఏర్పాటు చేయడం, రోడ్ల వెడల్పు, నూతన రోడ్లు, మరమ్మత్తులు చేసి ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకున్నారు.

జాతరలో నిరంతర నిఘా:
జాతరలో 300 ఎల్‌ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. జాతర నిర్వహణను పర్యవేక్షించేందుకు 300 సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించేందుకు ఆలయ పరిసర ప్రాంతాలను 10 జోన్లు, 38 సెక్టార్లు, 60 సబ్ సెక్టర్లుగా విభజించి సెక్టార్ల వారీగా అధికారులు సిబ్బందిని నియమించారు. సెక్టోరల్ అధికారులకు ఇచ్చిన వాకిటాకీ ద్వారా వివరాలు తెలుసుకుంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూన్నారు. దాదాపు 16 వేల మంది ఉద్యోగులు మేడారం విధులు నిర్వహిస్తున్నారు. భక్తుల రవాణాకు ఆర్‌టిసి ద్వారా 6వేల బస్సులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం రవాణా సౌకర్యాలు కల్పించేందుకు 2 కోట్ల 25 లక్షల నిధులు మంజూరి చెసింది. తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేసి సిసి కెమెరాల, టికెట్ బుకింగ్ కౌంటర్లు, లైటింగ్, రైలింగ్, త్రాగు నీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు చేసి రవాణాకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.
ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ ద్వారా రూ.13 కోట్ల 50 లక్షలతో పనులు చేపట్టారు. 17 ఇన్ ఫిల్టరేషన్ వెల్స్ , 495 ప్రాంతాలలో 5000 ట్యాప్స్ ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం కలగకుండా 40 జనరేటర్లు ఏర్పాటు చేశారు. 8,400 తాత్కాలిక మరుగుదొడ్లు 500 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అలాగే 7 ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేసి త్రాగునీరు అందిస్తున్నారు. మరుగుదొడ్ల ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు 300 మంది సిబ్బందిని నియమించారు.

పారిశుధ్య నిర్వహణకు 4 వేల కార్మికులను జిల్లా యంత్రాంగం ఎర్పాటు చెసింది. పారిశుధ్య నిర్వహణకు మేడారంకు ఆవల డంపింగ్ యార్డులు, మేడారం పరిసర ప్రాంతాల్లో 300 మిని డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు. పారిశుధ్య కార్మికులతో గద్దెల వద్ద, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విదంగా చర్యలు తీసుకుంటున్నారు.

జాతరలో నిరంతరం విద్యుత్ సరఫరాకు రూ.3 కోట్లు 97 లక్షలతో పనులు చేపట్టారు. నూతనంగా 210 ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ అందిస్తుంది. భక్తుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. మేడారం కల్యాణ మండపంలో కోటి రూపాయలతో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి 25 మంది వైద్యులు, 120 మంది వైద్యాధకారులు, 857 పార మెడికల్ సిబ్బందిని నియమించారు. మేడారం పరిసర గ్రామాల్లోను 75 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. క్యూ లైన్ల వద్ద మినీ క్యాంపులు ఏర్పాటు చేశారు. తాడ్వాయిలో 10 పడకలు, పస్రలో 5 పడకల ఆసుపత్రుల తోపాటు 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేశారు. ఈ జాతరలో ప్రత్యేకంగా 30 మొబైల్ అంబులెన్స్ లను ఎర్పాటు చేశారు. మేడారంలో శాంతి భద్రతల పరిరక్షణకు, జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. 12 వేల పోలీస్ సిబ్బందితో 300 సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో జాతర పరిసర ప్రాంతాల్లో 33 పార్కింగ్ స్థలాలను ఎర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News