Monday, May 6, 2024

హైకోర్టు తీర్పు రిజర్వ్‌పై సుప్రీంకు సోరెన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెలువరించడం లేదని పేర్కొంటూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హేమంత్ సోరెన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తన తీర్పును ఫిబ్రవరి 28న రిజర్వ్ చేసి ఇప్పటి వరకు తన నిర్ణయాన్ని చెప్పలేదని పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనానికి తెలియచేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేంమంత్ సోరెన్ రాజీనామా చేసి తన వారసుడిగా పార్టీ విధేయుడు, రవాణా మంత్రి చంపయి సోరెన్‌ను ప్రకటించిన అనంతరం జనవరి 31న ఇడి ఆయనను అరెస్టు చేసింది. ఈ కేసులో ఏడు గంటల పాటు ప్రశ్నించిన తర్వాత హేమంత్ సోరెన్‌ను ఇడి అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News