Monday, April 29, 2024

పాలమూరు బరిలో ప్రధాని మోడీ..

- Advertisement -
- Advertisement -

పాలమూరు: బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపి జితేందర్ రెడ్డి పాలమూరు ప్రజలకు ఒక శుభవార్త తెలిపారు. పాలమూరు బరిలో ప్రధాని మోడీ అనే వార్త పాలమూరు ప్రజలకు ఒక శుభవార్త అని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపి జితేందర్ రెడ్డి అన్నారు.అందులో భాగంగా శనివారం పాలమూరు పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపి జితేందర్ రెడ్డి హాజరైనారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరులో ప్రధాని మోడీ నిలబడితే నేను ముందుండి ఆయన గెలుపు కోసం పని చేస్తానని అన్నారు.

అందుకు అనుగుణంగా బూత్ స్థాయి లో కార్యకర్తలు పనిచేయాలని ఆయన సూచిస్తున్నారు. పార్టీ బూతు స్థాయి కార్యకర్తల పని వల్లే పార్టీ గెలుపు ఉంటుందని, నేను బూత్ స్థాయి కార్యకర్తల వల్లే ఈనాడు ప్రధాని అయినానని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరిగిందన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మన ప్రాంతం నుంచి పోటీ చేయాలంటే ప్రతి ఒక్కరూ తనకు తానుగా శక్తివంచన లేకుండా పార్టీ కోసం పని చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు పార్లమెంటు స్థానం నుంచి గెలిచి తెలంగాణ సాధించుకున్న తర్వాత పాలమూరు ప్రజల కోసం పట్టించుకోలేదన్నారు. దగాపడ్డ పాలమూరు ప్రజల బాగు కోసం భారతీయ జనతా పార్టీ ముందుండి పోరాడుతుందన్నారు. దేశంలోనే తెలంగాణ రైతు ఆత్మహత్యలు నాలుగో స్థానం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయని ఉద్యమ నేతగా ఉన్న కెసిఆర్ కు ఓట్లేసి గెలిపించి పాలమూరు ప్రజలు మోసపోయారన్నారు. పాలమూరు వలసలు ఇంకా ఆగలేదని అవి ఆయన అన్నారు.

20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని చెప్పిన కెసిఆర్ ఎనిమిదేళ్లు గడిచిన ఏ ఒక్క ఎకరానికి సాగునీరు ఇవ్వడం లేదని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకుని మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తానన్నాడు. 8 ఏళ్లయినా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారన్నారు. బ్యాంకులలో వడ్డీ పెరిగి అప్పుల బారిన రైతులు పడ్డారన్నారని, కేజీ టు పిజి ఉచిత విద్యా అని చెప్పి దాని మూసే ఎత్తటం లేదు అన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇస్తానని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నిరుద్యోగా భృతి,దళి తుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని, దళిత బంధు ఇలా అనేక అబద్ధాలు చెప్పి అధికారాన్ని అనుభవిస్తున్న కెసిఆర్ మాటలు ప్రజలు నమ్మడం లేదన్నారు. ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రి కెసిఆర్ కు బుద్ధి చెప్పాలంటే పాలమూరు మోడీ ని పాలమూరు నుండి పోటీకి పాలమూరు ప్రజల తరఫున అప్పీలు పెడతానన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి .జిల్లా ఉపాధ్యక్షులు క్రిస్టియ నాయక్. పడాకుల సత్యం. జిల్లా కోశాధ్యక్షులు పాండురంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి నల్ల మద్ది సురేందర్ రెడ్డి జిల్లా సీనియర్ నాయకులు ఎన్ పీ వెంకటేష్. మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జయశ్రీ మహిళా మోర్చా నాయకురాలు అంజమ్మ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పద్మ వేనమ్మ. విజయలక్ష్మి. యాదమ్మ. నిరంజన్ అమ్మ. యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి. మైనార్టీ మోస జిల్లా అధ్యక్షుడు నయీమ్. బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్. ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోవింద్ నాయక్. తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News