Thursday, May 8, 2025

మాజీ మంత్రి విజయరామారావు మృతి.. సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిబిఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  ఆయన మృతిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణంపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని కెసిఆర్ పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో విజయరామారావుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సిఎం ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగతులైన మాజీ మంత్రి విజయరామారావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News