Sunday, December 15, 2024

ఢిల్లీలో పివిఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో పేలుడు

- Advertisement -
- Advertisement -

దేశ రాజధానిలోని రోహిణికి చెందిన ప్రశాంత్ విహార్‌లోని పివిఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో గురువారం పేలుడు సంభవించింది. స్వల్ప తీవ్రతతో ఉన్న పేలుడు కారణంగా సమీపంలో నిలిపిఉన్న ఒక త్రిచక్ర వాహనం డ్రైవర్ స్వల్పంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 11.48 గంటలకు తమకు ప్రశాంత్ విహార్‌లో బాంబు పేలుడు సంభవించినట్లు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నామని ఢిల్లీ అగ్నిమాపక సర్వీసుల అధికారి ఒకరు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసు బృందాలు చేరుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. గతనెలలో ప్రశాంత్ విహార్‌లోని సిఆర్‌పిఎఫ్ స్కూలు ప్రహరీ వెలుపల కూడా ఇటువంటి బాంబు పేలుడే జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నేటి ఉదయం ఒక స్వీట్ షాపు వెలుపల స్వల్ప తీవ్రతతో పేలుడు జరిగిందని వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News