Saturday, July 27, 2024

నామినేటెడ్‌పై నజర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ పోస్టుల భర్తీ విషయంలో ఆ పార్టీ ఆచితూచి అడుగులేస్తోంది. ఇప్పటికే ఆశావహులకు సంబంధించి మూడు కేటగిరిలుగా విభజించి సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా జాబితాలను సిద్ధం చేసి ఏఐసిసితో కూడా ఆయా పేర్లను గ్రీన్ సిగ్న ల్ పొందినట్లుగా తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయం కో సం పని చేసిన వారితో పాటు అసెంబ్లీ టికెట్లు కోల్పోయిన నాయకులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే దిశగా టిపిసిసి కసరత్తు చేసినట్టుగా సమాచారం. శాసనసభ ఎన్నికల సమయం లో ఏఐసిసితోపాటు రాష్ట్ర సమన్వయ కమిటీ, ఇతర నాయకులు ఇచ్చిన హామీల మేరకు ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని నిర్ణయించినట్టు గా తెలిసింది. సుమారు 50కి పైగా నా మినెటెడ్ పోస్టులు ఉం డడంతో అన్నీ ఒకేసారి భర్తీ చేయా లా లేదా విడతల వారీగా భర్తీ చేయాలా అన్న విషయాన్ని రాష్ట్ర నాయకత్వం తేల్చుకోలేకపోతున్నట్లుగా సమాచారం. అయితే లోక్‌సభ ఎన్నికలు త్వరలో ఉండడంతో నామినేటెడ్ పదవుల ప్రభావం ఆ ఎన్నికలపై  ఉండే అవకాశం ఉండడంతో టిపిసిసి తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే లోపు 20 పైచిలుకు మందిని కార్పొరేషన్ చైర్మన్‌లుగా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
ప్రధాన పోస్టుల వివరాలు
ఇప్పటికే వక్ఫ్‌బోర్డు చైర్మన్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పదవులను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన వాటిలో ఒక్కొక్కటిగా భర్తీ చేయాలని నిర్ణయించిందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా ఆర్టీసి, టిఎస్‌ఐఐసీ, మహిళ కమిషన్, ఆగ్రో, రైతుబంధు సమితి, పర్యాటకం, మార్క్‌ఫెడ్, సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆయిల్‌ఫెడ్, వేర్ హౌసింగ్, ఫిషరీస్ కో ఆపరేటివ్, డైరీ డెవలప్‌మెంట్, బిసి డెవలప్‌మెంట్ కార్పొరేషన్, పౌర సరఫరాల కార్పొరేషన్, హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ తదితర 50కి పైగా కార్పొరేషన్ల చైర్మన్ పోస్టులతో పాటు దేవాలయాల ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, మార్కెట్‌యార్డ్ చైర్మన్లు ఇలా వివిధ రకాల నామినేటెడ్ పదవులను భర్తీ చేయాల్సి ఉండడంతో మొదట 50కి పైగా ఉన్న రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులను టిపిసిసి భర్తీ చేయనుంది.
నిఘా వర్గాల నివేదికల ఆధారంగా
అయితే నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఆరోపణలు, అసంతృప్తులు ఎదురుకాకుండా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం జాగ్రత్త పడుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే టిఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్, సభ్యుల భర్తీలో చైర్మన్‌తో పాటు ఒకరిద్దరు సభ్యులు పార్టీలో ఎలాంటి సేవలు చేయకపోయినా అవకాశం కల్పించారన్న విమర్శలు వచ్చాయి. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో అలాంటి విమర్శలకు తావులేకుండా పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్ రెడ్డి జాబితాల రూపకల్పనలో ఒకటికి రెండుసార్లు పరిశీలన చేశారు. ఆ పరిశీలన చేసిన జాబితాను ఏఐసిసి కార్యదర్శులు ఇచ్చిన జాబితాను కూడా నిశితంగా పరిశీలించి సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పదవులు ఇవ్వాలనుకున్న నాయకులకు సంబంధించి ఇప్పటికే నిఘా వర్గాలకు సమాచారం ఇచ్చి ఎంక్వైరీలు కూడా పూర్తి చేయించుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ, రాజకీయ నేపథ్యాలతో పాటు ఇతర అంశాలపై కూడా నిఘా వర్గాలు ఆరా తీసి నివేదికలు అందజేసినట్లు సమాచారం.
మహబూబ్‌నగర్ నుంచి పలువురు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్ నుంచి పిసిసి ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేశ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి, ఓబిసి జాతీయ సమన్వయకర్త కేతూరి వెంకటేశ్, మహబూబ్‌నగర్ మాజీ డిసిసి అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, కొల్లాపూర్ నుంచి జగదీశ్వరరావు, మెదక్ నుంచి పిసిసి అధికార ప్రతినిధి ఎం.భవానిరెడ్డి, బండారు శ్రీకాంత్‌రావు, ఎంఏ ఫయూమ్, హైదరాబాద్ నుంచి మెట్టు సాయికుమార్, వవన్‌కుమార్, మోతా రోహిత్ ముదిరాజ్, నూతి శ్రీకాంత్‌గౌడ్, శ్రీకాంత్ యాదవ్, జి.నిరంజన్, అల్లం భాస్కర్, నిజాముద్దీన్లు ఆశిస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పిసిసి ప్రధాన కార్యదర్శి చరణ్ కౌసిక్ యాదవ్, సామా రామ్మోహన్ రెడ్డి, భూపతి రెడ్డి నర్సారెడ్డి, మల్‌రెడ్డి రామిరెడ్డి, కిషోర్ రెడ్డి, దర్పల్ రాజశేఖర్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, రఘునాథ్ యాదవ్, సత్యం శ్రీరంగం, కల్వ సుజాత, మాజీ మంత్రి పుష్పలీలలు ఆశిస్తున్నారు. కరీంనగర్ నుంచి సత్తు మల్లేషు, గజ్జ్జెల కాంతం, నేరెళ్ల శారద, అలిగిరెడ్డి ప్రవీన్ రెడ్డి, రోహిత్ రావ్, వరంగల్ నుంచి రవళి రెడ్డి, లింగోజి, జంగా రాఘవ రెడ్డి, మొగుళ్ల రాజిరెడ్డి, నెహ్రునాయక్, మేకల వీరన్నయాదవ్, బెల్లయ్యనాయక్, బండి సుధాకర్ గౌడ్, ఖమ్మం నుంచి లోకేశ్ యాదవ్, సత్యనారాయణ గౌడ్, పోట్ల నాగేశ్వరరావు, విజయాబాయి, రాయల నాగేశ్వరరావులు చైర్మన్ పదవుల రేసులో ఉన్నారు.
ఇక నల్లగొండ నుంచి…
ఇక నల్లగొండ నుంచి పున్న కైలాస్ నేత, పటేల్ రమేష్ రెడ్డి, చెవటి వెంకన్నయాదవ్, ప్రీతం, శంకర్ నాయక్, బండ్రు శోభారాణి, నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్ కుమార్, వేణుగోపాల్ యాదవ్, మోహన్ రెడ్డి, గంగారాం, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, అదిలాబాద్ నుంచి విశ్వప్రసాద్ రావు, నరేశ్ జాదవ్, సేవాలాల్ రాథోడ్, బెల్లయ్యనాయక్, గోమాత శ్రీనివాస్ తదిరులు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News