Sunday, September 15, 2024

సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలి : విరాట్ కోహ్లి

- Advertisement -
- Advertisement -

లండన్: ప్రతి ఆటగాడికి కెరీర్‌లో ఒడిదొడుకులు, సవాళ్లు సహాజమేనని, వాటన్నింటిని అధిగమించి ముందుకు సాగితేనే కెరీర్ విజయవంతమవుతుందని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ సిరీస్‌లు లేకపోవడంతో కోహ్లి ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్‌లో సందడి చేస్తున్నాడు. ఈ సందర్భంగా కోహ్లి ఓ ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. విజయాలను మాత్రమే కాకుండా క్లిష్ట పరిస్థితుల్లోనూ నిబ్బరంగా ఉండటం చాలా ముఖ్యమన్నాడు. కెరీర్‌లో ఉన్నతస్థితికి వెళ్లిన తాను కూడా ఒకానొక దశలో విఫలమై నిరాశకు గురైన సందర్భాలు ఉన్నాయన్నాడు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న క్లిష్టమైన పరిస్థితులను ఈ సందర్భంగా కోహ్లి వెల్లడించాడు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడూ వాటికి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలన్నాడు. అప్పుడే మళ్లీ గాడిలో పడే అవకాశాలుంటాయన్నాడు. ఒత్తిడికి గురై చేతులెత్తేస్తే కెరీర్ అక్కడే ముగియడం ఖాయమన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News