Friday, May 2, 2025

ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులతో ఫడ్నవీస్ భేటీ

- Advertisement -
- Advertisement -

నాగపూర్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం నాగపూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయంలో కొందరు ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. బిజెపి అధ్యక్ష పదవికి ఫడ్నవీస్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులను ఆయన కలుసుకుని చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రేషింబాగ్ ప్రాంతంలోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరాన్ని సందర్శించిన ఫడ్నవీస్ ఆర్‌ఎస్‌ఎస్ నిర్వాహకులు కొందరితో సమావేశమయ్యారని వర్గాలు తెలిపాయి. అయితే ఈ భేటీ సారాంశం ఏమిటో తెలియరాలేదు. నాగపూర్‌లో జరిగే బిజెపి సదస్సులో కూడా ఫడ్నవీస్ పాల్గొననున్నారు. కాగా..బిజెపి అధ్యక్ష పదవికి తన పేరు పరిశీలనలో ఉన్నట్లు వెలువడిన వార్తలను ఫడ్నవీస్ శుక్రవారం మీడియా వద్ద తోసిపుచ్చారు. ఇది మీడియా సృష్టిగా ఆయన కొట్టిపారేశారు. ఇవి మీడియా సృష్టించిన వార్తలని, ఇవి మీడియాకే పరిమితమని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News