Sunday, September 15, 2024

‘ఇండియా చీర్స్ ఫర్ నీరజ్’ ప్రచారాన్ని ప్రారంభించిన శాంసంగ్

- Advertisement -
- Advertisement -

గురుగ్రామ్: ‘ఇండియా చీర్స్ ఫర్ నీరజ్’ ప్రచారం ద్వారా నీరజ్ చోప్రాకు తమ శుభాకాంక్షలు తెలియజేయడానికి అభిమానులను ముందుకు రావాలని కోరుతున్నట్లు శాంసంగ్ ఈరోజు ప్రకటించింది. ఈ ప్రచారంతో, నీరజ్‌కు మద్దతు ఇవ్వడం, శ్రేష్ఠత కోసం ప్రయత్నిస్తూ తన హద్దులు దాటి ముందుకు వెళ్లేలా ఆయనకు ప్రోత్సాహం అందించటం శాంసంగ్ ఇండియా లక్ష్యంగా చేసుకుంది.

నీరజ్ చోప్రాకు అందిస్తున్న అభిమానుల మద్దతును పెంచడానికి, వినియోగదారుల ఉత్సాహాన్ని చానలైజ్ చేయడానికి, దేశం యొక్క సామూహిక ప్రోత్సాహాన్ని పెంపొందించడానికి, శాంసంగ్ ఇండియా ఒక చిత్రాన్ని (film) ఆవిష్కరించింది. అనేక సవాళ్లతో పోరాడుతున్న ప్రసిద్ధ అథ్లెట్ యొక్క స్థిరత్వం, సంకల్ప స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, ఈ చిత్రం శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ అతని ప్రయాణానికి ఎలా సహాయపడుతుందో హైలైట్ చేస్తుంది.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 దాని శక్తివంతమైన గెలాక్సీ ఏఐ సాంకేతికతతో హద్దులను అధిగమిస్తుంది. వినియోగదారులకు అసమానమైన అనుభవాలను అందిస్తోంది. గెలాక్సీ ఏఐ శక్తివంతమైన, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఇంటర్‌ప్రెటర్, నోట్ అసిస్ట్ వంటి ఏఐ ఫీచర్‌లతో వస్తుంది, వినియోగదారులు మరింత ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేయడానికి, వారి ఉత్పాదకతను పెంచడానికి మరియు వారు పని చేసే, జీవించే విధానాన్ని మార్చడానికి అనుమతిస్తుంది.

“తమ పరిమితులను దాటి గొప్పతనాన్ని సాధించేలా వ్యక్తులను శక్తివంతం చేయాలని శాంసంగ్ విశ్వసిస్తుంది. శాంసంగ్ వద్ద గొప్పగా గౌరవించబడే శ్రేష్ఠత, అపరిమిత అవకాశాలు, విలువలకు మూర్తీభవించిన నీరజ్ చోప్రా వెనుక మేము మా శక్తిని ఉంచుతున్నాము. ‘ఇండియా చీర్స్ ఫర్ నీరజ్’ ప్రచారంతో, దేశం సామూహిక శక్తిని ఉపయోగించుకోవడం, నీరజ్‌ను ఉత్సాహపరిచేందుకు ‘అన్‌ఫోల్డ్ ది బెస్ట్’ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము” అని శాంసంగ్ ఇండియా ఎంఎక్స్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య బబ్బర్ అన్నారు.

“‘ఇండియా చీర్స్ నీరజ్’ ప్రచారం ద్వారా అందించబడిన శాంసంగ్ ఇండియా తిరుగులేని మద్దతు, ప్రేరణ కోసం నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అభిమానుల ప్రోత్సాహం, శుభాకాంక్షలు అమూల్యమైనవి, విజయం సాధించాలనే నా సంకల్పానికి తోడ్పడుతున్నాయి. నేను అధిగమించే ప్రతి సవాలుతో; నేను నా లక్ష్యాలకు చేరువవుతున్నాను. నాతో ఈ ప్రయాణంలో ఇప్పుడు సరికొత్త గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 తోడుగా వుంది. అత్యాధునిక గెలాక్సీ ఏఐ ఫీచర్స్తో కూడిన ఈ అద్భుతమైన పరికరం నా ఉత్తమమైనది ప్రదర్శించేందుకు తోడ్పడుతుంది. ‘GalaxyFoldIsGold’ అనే మంత్రం హద్దులు దాటి ముందుకు వెళ్లాలనే నా లక్ష్యం ను ప్రతిబింబిస్తుంది” అని నీరజ్ చోప్రా అన్నారు.

నీరజ్ చోప్రా ఇప్పుడు శాంసంగ్ ప్రత్యేకమైన ‘టీమ్ శాంసంగ్ గెలాక్సీ ’లో కూడా ఒక భాగం. వినియోగదారులు, అభిమానులు తమ శుభాకాంక్షలను శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌ Cheer for Neeraj Chopra Send a wish | Samsung India. ను సందర్శించడం ద్వారా ‘మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్‘గా ఖ్యాతి గడించిన నీరజ్ చోప్రాకు పంపవచ్చు. ప్రతి ఆకాంక్ష ఒక వైవిధ్యాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తూ, శాంసంగ్ ఇండియా వినియోగదారులు తమ కోరికలను వాట్సాప్ లో 9870-494949కి “NEERAJ” అని మెసేజ్ చేయడం ద్వారా పంపడానికి వీలు కల్పిస్తోంది. అదనంగా, వారు @SamsungIndia బ్రాండ్‌ను ట్యాగ్ చేయడం ద్వారా శాంసంగ్ సోషల్ మీడియా ఛానెల్‌లలో ఒక కామెంట్ చేయవచ్చు. శాంసంగ్ తమ వినియోగదారులను హ్యాష్‌ట్యాగ్స్: #IndiaCheersNeeraj, #GalaxyFoldIsGold, #GalaxyZFold6, #GalaxyAI, #Samsung తో సంభాషణలో చేరమని ప్రోత్సహిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News