Tuesday, May 7, 2024

నకిలీపై బ్రహ్మాస్త్రం

- Advertisement -
- Advertisement -

నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు
రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి
నకిలీ సర్టిఫికెట్ల గుర్తింపునకు చేపట్టిన చర్యలపై
ఉన్నత విద్యామండలి ఛైర్మన్,వైస్ ఛాన్స్‌లర్లతో డిజిపి సమీక్ష

ఫేక్ సర్టిఫికెట్లు గుర్తించేలా పోర్టల్

Fake certificates identify by portal

మనతెలంగాణ/హైదరాబాద్ : నకిలీ సర్టిఫికెట్లు గుర్తించేలా పోర్టల్ రూపొందించామని.. దీనిపై ఉన్నత విద్యామండలితో కలిసి పనిచేస్తామని రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి చెప్పారు. నకిలీ సర్టిఫికెట్ల బెడద పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లతో డిజిపి మహేందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీల్లో నకిలీ సర్టిఫికెట్ల గుర్తింపునకు చేపట్టిన చర్యలపై.. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ ఛైర్మన్ వి.వెంకటరమణ, వర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లతో అధికారులతో సమీక్షించారు. పోర్టల్ నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.ఈ సందర్భంగా డిజిపి మహేందర్ మాట్లాడుతూ, నకిలీ సర్టిఫికెట్ల నివారణకు డిజిపి పలు సూచనలు చేశారు. వర్సిటీలు జారీ చేసే అన్ని సర్టిఫికెట్లు పోర్టల్‌లో నమోదు చేస్తామని, ధ్రువపత్రాలు అసలువో, నకిలీవో తెలుసుకునేలా పోర్టల్ రూపొందించామని వివరించారు. ఈ పోర్టల్ సహాయంతో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫేక్ సర్టిఫికెట్లపై ప్రభుత్వం, పోలీస్ శాఖ కలిసి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. స్టేక్ హోల్డర్స్ అందరికీ సులువుగా ఉండాలని ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అమలు చేస్తున్నామని అన్నారు. నకిలీ సర్టిఫికెట్లపై లోకల్ పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఫేక్ సర్టిఫికెట్లు వెలుగులోకి వచ్చినప్పుడల్లా పోలీసులకు ఫిర్యాదు చేయాలని వర్సటీల అధికారులను డిజిపి కోరారు. ప్రపంచస్థాయిలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.

నకిలీ సర్టిఫికెట్ల నిర్మూలనకు మాస్టర్‌ప్లాన్ : ఛైర్మన్ లింబాద్రి

నకిలీ సర్టిఫికెట్ల నిర్మూలనకు మాస్టర్‌ప్లాన్ రూపొందించామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి తెలిపారు. 2010 నుంచి అన్ని యూనివర్సిటీల సర్టిఫికెట్లు పోర్టల్‌లో నమోదు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఛైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ, కంపెనీలు ఉద్యోగుల సర్టిఫికెట్లను పోర్టల్‌లో సరిచూసుకోవచ్చునని తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లు అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించామని చెప్పారు. నకిలీ సర్టిఫికెట్లను గుర్తించేలా ప్రత్యేకంగా పోర్టల్ రూపొందించామని పేర్కొన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సాధికారికంగా, సులభంగా, అథెంటిక్‌గా ఉండాలని భావిస్తున్నామని, ఫేక్ సర్టిఫికెట్లను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్లు, రిజిస్ట్రార్లు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్లు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News