Monday, September 1, 2025

పూరీ ఆలయం పేరిట నకిలీ వెబ్‌సైట్.. బ్లాక్ చేసిన అధికారులు

- Advertisement -
- Advertisement -

పూరీ: ఒడిశాలోని ప్రసిధ్ద పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంపై (Puri Jagannath Temple) ఆన్‌లైన్‌ పూజల పేరిట మోసం చేస్తున్న ఓ నకిలీ వెబ్‌సైట్‌ను పోలీసులు గుర్తించారు. క్షేత్రంలో పూజలు, దర్శనం, నైవేథ్య సమర్పణ తదితర సేవలు అందిస్తామంటూ అబద్ధపు ప్రచారం చేస్తూ ఆ వెబ్‌సైట్ రూ.వేలల్లో దోపిడికి పాల్పడుతోందని స్థానిక ఎస్పి ప్రతీక్ సింగ్ తెలిపారు. ఈ వ్యవహారం బయటపడటంతో సైబర్ బృందాన్ని అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ఆ వె‌బ్‌సైట్‌ను బ్లాక్ చేసి. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తప్పుడు ప్రకటనలు ఇచ్చే నకిలీ వెబ్‌సైట్లను నమ్మవద్దని భక్తులకు సూచించారు. మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దని తెలిపారు. ఆలయ యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించే ఛానెళ్ల ద్వారానే సేవలను ధృవీకరించుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో హోటళ్లను బుక్‌ చేసుకునే సమయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరమని తెలిపారు.

Also Read : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News