Sunday, June 22, 2025

కుటుంబ సమేతంగా చూసే చిత్రం

- Advertisement -
- Advertisement -

ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్న కథానాయకుడు ఫ్యామిలీనీ ద్వేషిస్తూ కనిపించిన ‘స:కుటుంబానాం’ టీజర్‌తో కథ తాలూకు కొత్తదనం చెప్పకనే చెప్పారు దర్శక రచయిత ఉదయ్ శర్మ. మణిశర్మ సంగీతం అందించిన ఈ సరికొత్త కుటుంబ కథా చిత్రంలో రాజేంద్రప్రసాద్, రామ్ కిరణ్, మేఘా ఆకాష్, బ్రహ్మానందం, సత్య, గిరి, భద్రం ముఖ్య తారాగణంగా.. ప్రేక్షకులని అలరించబోతున్నారు. తాజాగా విడుదలైన (latest release) ఈ చిత్ర టీజర్ విషయానికి వస్తే ఒక పక్క నుండి అర్జున్ రెడ్డి లాంటి వైబ్స్ కనిపిస్తూనే మరోపక్క కుటుంబ సమేతంగా చూసే చిత్రం అని అర్థమవుతుంది. టీజర్ లోని ప్రతి డైలాగ్, విజువల్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అలాగే సత్య, బ్రహ్మానందం హాస్యం చిత్రంలో బాగా పండిందని అనిపిస్తుంది. మేఘా ఆకాష్ మంచి క్యారెక్టర్‌లో నటించినట్లు అర్థమవుతుంది. రామ్ కిరణ్ ఈ చిత్రం ద్వారా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటాడు. త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కటి తెలుగింటి భోజనం అందించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News